Begin typing your search above and press return to search.

గతేడాదితో పోల్చితే భారీగా పెరిగిన ఐపీఎల్ వీక్షకులు

By:  Tupaki Desk   |   31 Oct 2020 10:30 AM GMT
గతేడాదితో పోల్చితే భారీగా పెరిగిన ఐపీఎల్ వీక్షకులు
X
ఓ వైపు కరోనా.. మరోవైపు లాక్ డౌన్.. ఈ విపత్కర పరిస్థితుల నడుమ ప్రపంచమే ఇంటికి పరిమితమైంది. గత ఆరేడు నెలలుగా ఓ ఎంటర్ టైన్ మెంట్ లేదు పాడు లేదు. ఇంట్లో ఉండి ఉండి జనాలకు బోర్ కొట్టేసింది. అటు సినిమాలు లేకపోవడంతో జనాలకు పిచ్చెక్కినట్టు అయ్యింది. ఈ సమయంలోనే మొదలైంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). మ్యాచ్ లు నువ్వానేనా అన్నట్టుగా టై అవుతున్నాయి. ఏకంగా చివరి అంకానికి చేరినా క్వాలిఫైయ్ అయ్యే జట్లు ఇప్పటికీ తేలడం లేదు. మ్యాచ్ మ్యాచ్ కి సమీకరణాలు మారిపోతున్నాయి. మరి ఆటగాళ్లు అంత కసిగా ఆడుతుంటే ప్రేక్షకులు చూడకుండా ఉంటారా? మునుపటి కూడా బాగా ఐపీఎల్ కు ఆదరణ దక్కుతోందని బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) ఇండియా విడుదల గణాంకాల ప్రకారం తెలుస్తోంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 13వ సీజన్ ను జనాలు విపరీతంగా ఆదరిస్తున్నారు. మునుపటి సీజన్ కంటే ఎక్కువ మంది ప్రేక్షకులను ఈసారి ఐపీఎల్ సంపాదించుకుందని బార్క్ తెలిపింది. డేటా ప్రకారం గత సీజన్ తో పోల్చితే ఈసారి ఐపిఎల్ చూసే వీక్షకుల సంఖ్య పెరిగింది "అని బార్క్ ఇండియా ట్వీట్‌లో తెలియజేసింది.

21 ఛానెళ్లలో ప్రసారమైన మొదటి 41 ఐపీఎల్ మ్యాచ్‌లకు 7 బిలియన్ల మంది చూసినట్టు బార్క్ డేటా తెలిపింది. అదే దశలో ఐపిఎల్ 12తో పోలిస్తే ఇది 28 శాతం ఎక్కువ అని తెలిపింది. 24 ఛానెళ్లలో ప్రసారం చేసిన గత ఐపీఎల్ 44 మ్యాచ్‌లను 5.5 బిలియన్ల మంది మాత్రమే చూశారని డేటా తెలిపింది.

ఐపీఎల్ కు ఆదరణ పెరగడానికి ప్రధాన కారణంతో కరోనాతో జనాలు భయపడి ఇంట్లో ఉండడం.. ఇక కరోనా బారిన పడిన వారు కూడా తప్పనిసరిగా ఐపీఎల్ చూస్తూ ఎంజాయ్ చేయడంతో వీక్షకుల సంఖ్య పెరిగిందని తెలిసింది. "స్టేడియంలో ఎవరూ చూడలేరు. కాబట్టి ప్రతి ఒక్కరూ టీవీలో మాత్రమే చూడగలరు. అందుకే ఐపీఎల్ 13 వీక్షకుల సంఖ్య ఎక్కువగా ఉందని స్పష్టంగా తెలుస్తుంది. ఈసారి ఐపీఎల్ తప్పకుండా కోవిడ్19కు, లాక్‌డౌన్‌కు కృతజ్ఞతలు చెప్పాలి. ఇందులో ప్రధాన పాత్ర పోషించింది " అని ఓ క్రీడా విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు.

ఐపిఎల్ 2020 ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు భారత్ లో కరోనా తీవ్రత దృష్ట్యా యుఏఈలో నిర్వహించబడుతోంది.