Begin typing your search above and press return to search.

అమెరికాలో వారి సంపాదనలో భారీ గండి !

By:  Tupaki Desk   |   14 Oct 2021 5:35 AM GMT
అమెరికాలో వారి సంపాదనలో భారీ గండి !
X
అమెరికా వంటి అగ్రరాజ్యంలో వివిధ వర్గాల మధ్య ఆర్థిక అంతరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి వారి సంపద నానాటికీ పడిపోతోంది. బ్లూమ్‌బర్గ్ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. అమెరికాలో మధ్యతరగతి వర్గం మొత్తం సంపదలో ఏకంగా 26.6 శాతం మేర కోత పడింది. ఇప్పటికే పెరుగుతున్న ఆర్థిక అంతరాలకు, కరోనా సంక్షోభం కూడా తోడై మధ్యతరగతి వారి జీవన విధానంలో భారీ మార్పులకి శ్రీకారం చుడుతోంది. మరోవైపు బిలియనీర్ల సంపద మాత్రం అంతకంతకూ వృద్ధి చెందుతూనే ఉంది.

బ్లూబ్‌ బర్గ్ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం అమెరికాలో అపరకుబేరులుగా పేరు పడ్డ ఒక శాతం మంది ధనవంతుల చేతుల్లోనే జాతి సంపదలో ఏకంగా 27 శాతం కేంద్రీకృతమై ఉంది. అమెరికా మధ్యతరగతి వర్గాల ఆర్థిక భద్రత క్రమంగా కనుమరుగవుతోందని ఈ గణాంకాలు రుజువు చేస్తున్నాయి అని బ్లూమ్‌ బర్గ్ తన నివేదికలో వ్యాఖ్యానించింది. కరోనా సంక్షోభం నుంచి అమెరికా ప్రజలను గట్టెక్కించేందుకు అక్కడి ప్రభుత్వం వేల కోట్ల నిధులను కుమ్మరించినప్పటికీ మధ్యతరగతి వారు మాత్రం క్రమంగా తమ సంపదను కోల్పోయినట్టు ఈ నివేదికలో వెల్లడైంది. ప్రస్తుతం అమెరికా మిడిల్ క్లాస్ వర్గాల మొత్తం సంపద కంటే అపరకుబేరుల వద్ద ఉన్న సంపదే ఎక్కువని బ్లూమ్‌ బర్గ్ స్పష్టం చేసింది.


అమెరికాలో భారతీయుల హవా కొనసాగుతోంది. చదువుతో పాటు ఆదాయార్జనలో మనోళ్లు అమెరికన్లతో పోలిస్తే ఎంతో ముందున్నట్లు తాజా గణాంకాల్లో వెల్లడైంది. అమెరికాలో గత మూడు దశాబ్దాలలో ఆసియన్ల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని న్యూయార్క్ టైమ్స్ విశ్లేషణలో తేలింది. అమెరికా జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకొని ఈ వివరాలు వెల్లడించింది. దీని ప్రకారం.. అమెరికాలో ప్రస్తుతం 40 లక్షల మంది భారత సంతతి ప్రజలు నివసిస్తున్నారు. ఇందులో 10 లక్షల మంది అమెరికాలోనే జన్మించగా.. 16 లక్షల మంది వీసా హోల్డర్లు ఉన్నారు. మరో 14 లక్షల మందికి చట్టబద్ధమైన నివాస ధ్రువపత్రాలు ఉన్నాయి.

అమెరికాలో ఒక్కో కుటుంబం సంపాదన జాతీయ సగటు 63,922 డాలర్లు కాగా.. భారత సంతతి కుటుంబాల సంపాదన మాత్రం అంతకు రెట్టింపుగా ఉంది. ఒక్కో భారతీయ కుటుంబం లక్షా 23 వేల 700 డాలర్లను సంపాదిస్తోంది. ఆసియాలోని ఇతర దేశాల ప్రజలతో పోల్చినా భారతీయుల సంపాదనే ఎక్కువగా ఉంది. తైవాన్ కుటుంబాలు 97,129 డాలర్లు ఆర్జిస్తుంటే, ఫిలిప్పీన్స్ సంతతి కుటుంబాలు 95 వేల డాలర్లను వెనకేసుకుంటున్నారు. 14శాతం భారతీయుల కుటుంబాల సంపాదన మాత్రమే 40 వేల డాలర్ల కన్నా తక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రజల్లో ఈ సంఖ్య 33 శాతంగా ఉండటం గమనార్హం. అటు చదువు విషయంలోనూ మనోళ్లే ముందున్నారు. దేశంలోని మొత్తం జనాభాలో కాలేజీ డిగ్రీ ఉన్నవారు 34 శాతం కాగా.. భారతీయుల్లో ఈ సంఖ్య ఏకంగా 79శాతంగా ఉంది.కంప్యూటర్ సైన్స్, ఫైనాన్సియల్ మేనేజ్మెంట్, మెడిసిన్ వంటి అధిక జీతాలు వచ్చే ఉద్యోగాల్లో భారత సంతతి ప్రజలు ఎక్కువగా పనిచేస్తున్నారు. అమెరికాలోని మొత్తం వైద్యులలో 9 శాతం మంది భారత సంతతి వ్యక్తులే ఉన్నారు. అందులో సగం మంది ఇమ్మిగ్రెంట్ వీసా మీద వెళ్లినవారేనని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.