Begin typing your search above and press return to search.

విజయ్​ మాల్యా కు మరో షాక్​.. ఫ్రాన్స్​ ఆస్తులు స్వాధీనం..!

By:  Tupaki Desk   |   5 Dec 2020 3:21 AM GMT
విజయ్​ మాల్యా కు మరో షాక్​..  ఫ్రాన్స్​ ఆస్తులు స్వాధీనం..!
X
బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న కింగ్​ఫిషర్​ అధినేత విజయ్​మాల్యాకు ఈడీ షాక్​ ఇచ్చింది. ఫ్రాన్స్​లో ఉంటున్న అతడి ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకున్నది. ఫ్రాన్స్​లో అతడికి 1.6 మిలియన్ యూరోలు (రూ. 14 కోట్లు) విలువైన ఆస్తులు ఉన్నట్టు సమాచారం. ఈ ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకున్నది. విజయ్​మాల్యాకు బ్రిటన్​ సహా పలు దేశాల్లో ఆస్తులున్నాయి. పారిస్​లోని అతడికి ఆస్తులు ఉన్నట్టు గుర్తించిన ఈడీ.. ఈ మేరకు ఫ్రెంచ్​ అధికారులకు లేఖ రాసింది.

దీంతో అక్కడి అధికారులు ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పటివరకు 11వేల231కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ ప్రకటించింది. ప్రస్తుతం లండన్​లో ఉన్న మాల్యాను ఇండియాకు తీసుకొచ్చేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ కొన్ని బ్రిటన్​ చట్టాలలోని లొసుగులను వాడుకొని అతడు లండన్​ దాటకుండా అక్కడే ఉంటున్నారు. మాల్యా మనదేశంలోని పలు బ్యాంకులకు మొత్తం రూ. 9000 కోట్లు అప్పులు చేసి ఎగ్గొట్టాడు.

అయితే ఈ విషయంపై మాల్యా అతడి తరఫు లాయర్లు భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. తమ ఆస్తులను అమ్ముకొనేందుకు అవకాశం కల్పిస్తే వాటిని విక్రయించి డబ్బులు చెల్లిస్తానని మాల్యా చెబుతున్నాడు. తన ఆస్తుల విలువ రూ. 9వేల కోట్ల కంటే ఎక్కువే ఉంటుందని అందువల్ల ఆస్తులను తనకు అప్పగించాలని కోరుతున్నాడు. కానీ ఈ విషయంపై ఇంతవరకు ఈడీ స్పందించలేదు.