బాబా రాందేవ్ కు షాక్: నేపాల్ లో ‘కొరొనిల్’ మెడిసిన్ నిలిపివేత

Wed Jun 09 2021 15:00:00 GMT+0530 (IST)

Huge Shock To Baba Ramdev

కరోనా నివారణ మందు ‘కొరొనిల్’ తయారు చేసిన యోగా గురువు బాబా రాందేవ్ కు మరో చిక్కుల్లో పడ్డారు. రాందేవ్ నేతృత్వంలోని పతంజలి సంస్థ గిఫ్ట్ గా ఇచ్చిన కొరొనిల్ మందు కిట్స్ పంపిణీని నేపాల్ ప్రభుత్వం నిలిపివేసింది.కోవిడ్19 వైరస్ సోకకుండా నిరోధకశక్తిని పెంచుతుందని ప్రచారంలో ఉన్న కొరొనిల్.. 1500 కిట్స్ ని సేకరించడంలో సరైన విధానాన్ని పాటించలేదని ఖట్మండూ లోని ఆయుర్వేద విభాగం తేల్చింది. దీంతో ఈ పంపిణీని నిలిపివేస్తున్నట్టుగా పేర్కొంది.

పైగా కోవిడ్ చికిత్సకు వాడే మందులతో పోలిస్తే కొరొనిల్ టాబ్లెట్లు నాసల్ ఆయిల్ కూడా సరితూగజాలవని నేపాల్ ప్రభుత్వం వెల్లడించింది. దీంతో నేపాల్ లో ఈ మందును నిలిపివేశారు.

ఇండియాలో రాందేవ్ పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పెట్టిన కేసులను కూడా అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఆ కేసులు ఫిర్యాదులతో చిక్కుల్లో పడిన యోగా గురువు రాందేవ్ కి ఇప్పుడు నేపాల్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది.

ఇప్పటికే భూటాన్ కూడా కొరొనిల్ మెడిసిన్ పంపిణీని నిలిపివేసింది. భూటాన్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు నేపాల్ కూడా నిషేధించి రాందేవ్ బాబాకు గట్టి షాక్ ఇచ్చింది.