Begin typing your search above and press return to search.

టిక్కెట్ వార్ జోరుగా సాగుతోంది

By:  Tupaki Desk   |   2 Sep 2018 10:50 AM GMT
టిక్కెట్ వార్ జోరుగా సాగుతోంది
X
టిక్కెట్ వార్ జోరుగా సాగుతోంది. అక్కడ పోటీ చేయడం అటుంచి టిక్కెట్ దక్కించుకోవడమే నేతలకు తలకు మించిన భారమవుతోంది. ఒక్క టిక్కెట్ కోసం ముగ్గురు నలుగురు పోటీపడుతున్నారు. టిక్కెట్ దక్కిందా విజయం తథ్యం అన్నట్టుంది పరిస్థితి.. ఈ నేపథ్యంలో సిట్టింగ్ లపై కత్తి వేలాడుతోంది. సర్వేల్లో ఎవరికి మొగ్గు ఉందనే దానిపైనే నేతలకు టిక్కెట్ హామీ లభిస్తోంది.

నెల్లూరు జిల్లాలో ఆది నుంచి ప్రతిపక్ష వైసీపీ బలంగా ఉంది.వచ్చే ఎన్నికల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేయొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఈ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే టిక్కెట్ హాట్ కేకులా మారింది. ఒక్కో సీటుపై ఇద్దరు, ముగ్గురి మధ్య పోటీ నడుస్తోంది. వైసీపీ టిక్కెట్ దక్కితే చాలు ఎమ్మెల్యే అయిపోతారనే ప్రచారం దక్కుతోంది. అందుకే వైసీపీ టిక్కెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

నెల్లూరు జిల్లా కావలి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు ఈయనకు టిక్కెట్ సెగ అంటుకుందట..కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన కాటం రెడ్డి విష్ణు వర్ధన్ రెడ్డి , టీడీపీ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి కావలి టిక్కెట్ రేసులో ఉన్నారట..దీంతో కావలి వైసీపీలో సాగుతున్న మూడు ముక్కలాటలో టిక్కెట్ ఎవరికీ వరిస్తుందనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

2014 ఎన్నికల్లో ప్రతాప్ రెడ్డి గెలుపు కోసం విష్ణువర్ధన్ రెడ్డి, వేణుగోపాల్ ఇద్దరూ పనిచేశారు. కానీ ఈసారి తాము బరిలోకి దిగుతామని వారిద్దరూ అంటున్నారు. జగన్ చేయించిన సర్వేల్లో ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిపై నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందట.. దీంతో వేణుగోపాల్ రెడ్డి తనకు టిక్కెట్ ఇస్తే గెలిచి చూపిస్తానని అధిష్టానం వద్ద ప్రతిపాదన పెట్టాడట..

ఇక గత ఎన్నికల్లో ప్రతీప్ కి, విష్ణు వర్ధన్ రెడ్డికి మధ్య ఓ ఒప్పందం జరిగిందట.. ఈ ఎన్నికల్లో నీకు మద్దతిస్తానని.. వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతిచ్చి టిక్కెట్ ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారట.. అలా ఎమ్మెల్యే అయిన ప్రతాప్ తర్వాత మాట మార్చాడట.. ఇప్పుడు విష్ణు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసి ఒంటరిగా వైసీపీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నాడట.. ఈ ముగ్గురి దూకుడుతో పార్టీ క్యాడర్ అయోమయంలో పడింది. జగన్ టిక్కెట్ ఎవరికీ ఇస్తారో.. ఎవరితో నడవలా తెలియక కిందిస్థాయి నేతలు తలలు పట్టుకుంటున్నారట.. మరి ఈ ముగ్గురిలో ఎవరికీ కావలి ఎమ్మెల్యే టిక్కెట్ దక్కుతుందనే చర్చ వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది.