ఒక్క పేషెంట్కు ఎంత ఆక్సిజన్ అవసరం..!

Fri May 07 2021 18:00:01 GMT+0530 (IST)

How much oxygen does a patient need

ప్రస్తుతం మన దేశంలో ఆక్సిజన్ అనే పదం చాలా విరివిగా వినిపిస్తున్నది. కేవలం వైద్యులకు మాత్రమే అవసరమైన కొన్ని పదబంధాలు ఇప్పుడు మనకు నిత్య కృత్యం అయ్యాయి. కరోనా వచ్చేవరకు మాస్కులు శానిటైజర్ చాలా వరకు జనబాహల్యానికి తెలియవు. ఇక ఇప్పుడైతే ఆక్సీమీటర్లు థర్మామీటర్లు ఆక్సిజన్ సిలిండర్లు కృత్రిమ ఆక్సిజన్ అనే పదాలు సాధారణం అయిపోయాయి. ఇక కేవలం ఆక్సిజన్ అందక ప్రతిరోజూ పదుల సంఖ్యలో కోవిడ్ బాధితులు కరోనా బారిన పడుతున్నారు.మరోవైపు చాలా మందికి ఆస్పత్రుల్లో బెడ్లు కూడా అందడం లేదు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంది.ఇదిలా ఉంటే చాలా మందికి ఆక్సిజన్ దొరకడం లేదు. ఇక ఇదే అదనుగా మెడికల్ మాఫియా చెలరేగిపోతున్నది. ఆక్సిజన్ కావాల్సిన వాళ్లు అయితే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. అయితే ఆక్సిజన్ ఎవరికి అవసరం. ఏ పరిస్థితుల్లో ఎంత మొత్తంలో ఆక్సిజన్ అవసరం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. కరోనా సోకిన వారందరికీ ఆక్సిజన్ అవసరం ఉండదని డాక్టర్లు చెబుతున్నారు.

కేవలం పదిశాతం మందికి మాత్రమే ఆక్సిజన్ అవసరం పడొచ్చు. వారిలో చూడా అతికొద్ది మందికి హై ఫ్లో నాజల్ కాన్నులా (హెచ్ఎఫ్ఎన్‌సీ) అవసరం అవుతుంది. ఒక వ్యక్తి పడుకొని ఉన్నప్పుడు నిమిషానికి 7 నుంచి 8 లీటర్ల గాలిని పీల్చుకుంటాడు. అందులోని ఆక్సిజన్ను ఊపిరితిత్తులు వేరుచేసి శరీరభాగాలకు అందజేస్తాయి. అయితే కరోనాతో  రోగుల ఊపిరితిత్తులు పనితీరు మందగిస్తుంది. దీంతో కోవిడ్ రోగులకు ఆక్సిజన్ అందజేయవలిసిన అవసరం ఏర్పడింది.

ఆక్సిజన్ స్థాయి 90శాతానికన్నా తగ్గినప్పుడే మెడికల్ ఆక్సిజన్ అవసరం ఉంటుంది. కరోనా రోగుల్లో ఒక్కక్కరికీ ఒక్కో మోతాదులో ఆక్సిజన్ అవసరం పడుతుంది. అది వారి ఊపిరితిత్తుల పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. కొంత మంది పేషెంట్లకు హెచ్ఎన్ఎఫ్‌సీ సపోర్ట్ అవసరం అవుతుంది. వాళ్ల ఆక్సిజన్ అవసరాలు నిమిషానికి 60 లీటర్లు అంటే గంటకు 3600 లీటర్లు దాటుతుంది. కొన్ని కేసుల్లో అయితే ఈ అవసరం రోజుకు 86000 లీటర్లకు చేరుకోవచ్చని డాక్టర్లు అంటున్నారు.అయితే కొందరు ప్రైవేట్ ఆస్పత్రుల వాళ్లు దీని లాభస్థాయి వ్యాపారం చేసుకుంటున్నారు. ఆక్సిజన్ పేరు చెప్పి రోగుల వద్ద రూ. లక్షలు వసూలు చేస్తున్నారు.