Begin typing your search above and press return to search.

ఆక్సిజ‌న్‌తో ఇన్ని ల‌క్ష‌ల మంది బెడ్ల మీదున్నారా?.. దేవుడా ర‌క్షించు ?

By:  Tupaki Desk   |   9 May 2021 7:30 AM GMT
ఆక్సిజ‌న్‌తో ఇన్ని ల‌క్ష‌ల మంది బెడ్ల మీదున్నారా?.. దేవుడా ర‌క్షించు ?
X
ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి క్రియేట్ చేస్తోన్న విల‌యానికి ఎప్పుడు బ్రేక్ ప‌డుతుందో ? కూడా తెలియ‌డం లేదు. ప్ర‌తి ఒక్క‌రు గాలిలో ప్రాణాలు అర‌చేతిలో ప‌ట్టుకుని దేవుడిని ప్రార్థించ‌డం, జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం మిన‌హా చేసేదేం లేకుండా పోతోంది. క‌రోనా వ‌స్తే ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా తిరిగి జీవిస్తామ‌న్న గ్యారెంటీ అయితే ఎవ్వ‌రికి లేకుండా పోయింది. వైద్యం అంద‌క క‌రోనా రోగులు ప‌డుతోన్న బాధ‌లు చూస్తుంటే గుండె త‌రుక్కుపోతోంది. దేశంలో స‌గ‌టున రోజుకు 4 ల‌క్ష‌ల పాజిటివ్ కేసులు అధికారిక లెక్క‌ల ప్ర‌కారం న‌మోదు అవుతున్నాయి. ఆగ‌స్టు నాటికి ఈ సంఖ్య అధికారికంగానే 10 ల‌క్ష‌లు దాటుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

దేశంలో కరోనా సృష్టిస్తున్న విలయానికి ఇది మరో ఉదాహరణ. అయితే ప్ర‌స్తుతం అన‌ధికారిక లెక్క‌ల ప్ర‌కార‌మే రోజుకు స‌గ‌టున 10 ల‌క్ష‌ల‌కు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌స్తుతం ఉన్న లెక్క‌ల ప్ర‌కారం దేశంలో 1,70,841 కరోనా రోగులు వెంటిలేటర్లపై చికిత్స పొందుతుండగా, 9,02,291 మంది రోగులు ఆక్సిజన్ స‌హాయంతో మంచాల‌పై జీవ‌చ్చ‌వాల లెక్క‌న ప‌డిఉన్నారు. ఇప్ప‌టికే 9 ల‌క్ష‌ల మంది ఆక్సిజ‌న్ స‌పోర్టుతోనే జీవిస్తున్నారు. అయితే క్ష‌ణ క్ష‌ణానికి ఆక్సిజ‌న్ ప‌ల్స్ ప‌డిపోతోన్న వారి సంఖ్య ల‌క్ష‌ల‌కు చేరుకుంటోంది.

ఇప్పుడే చాలా చోట్ల ఆక్సిజ‌న్ కొర‌త ఉంది. దీనికి తోడు ప‌ల్స్ ప‌డిపోయే క‌రోనా రోగులు మ‌రింత ఎక్కువ అయితే వీరికి అస‌లు ఆక్సిజ‌న్‌, మందులు అందించే సామ‌ర్థ్యం పూర్తిగా లేద‌నే చెప్పాలి. ఇక దేశ జ‌నాభాలో 1.34 శాతం మంది ఐసీయూలో ఉండగా, 0.39 శాతం మంది రోగులు వెంటిలేటర్లపై ఉన్నారని, 3.70 శాతం మంది రోగులు ఆక్సిజన్ సపోర్ట్‌తో చికిత్స పొందుతున్నార‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ లెక్క‌లు చెపుతున్నాయి. అయితే ఇప్పుడు ఉత్ప‌త్తి అవుతోన్న ఆక్సిజ‌న్ క‌రోనా రోగుల‌కు ఎంత మాత్రం స‌రిపోయే ప‌రిస్థితి లేదు.

మే 20వ తేదీ నాటికి కేసుల సంఖ్య డ‌బుల్ అవ్వ‌డంతో పాటు ఊహించ‌ని విధంగా పెరుగుతోంద‌న్న ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో అస‌లు దేశంలో ఎంత మంది ఉంటారు ? జూన్ నాటికి ప‌రిస్థితి ఎలా ఉంటుందో ? ఊహించుకోవ‌డానికే భ‌యంగా ఉంది. దేశీయంగా ఆక్సిజన్‌ ఉత్పత్తిని రోజుకు 9400 మెట్రిక్ టన్నులకు పెంచాల్సిన అవసరం ఉందని ఆరోగ్య మంత్రిత్వశాఖ చెపుతున్నా అది సాధ్య‌మ‌య్యే ప‌రిస్థితి లేదు.