Begin typing your search above and press return to search.

మేరియుపోల్ ను రష్యా ఎలా ఆక్రమించుకుంది..?

By:  Tupaki Desk   |   18 May 2022 9:30 AM GMT
మేరియుపోల్ ను రష్యా ఎలా ఆక్రమించుకుంది..?
X
నువ్వా.. నేనా..? అన్నట్లుగా సాగుతున్న రష్యా, ఉక్రెయిన్ల యుద్ధంలో సోవియట్ యూనియన్ పైచేయి సాధించే దిశగా ముందుకు వెళ్తోంది. ఉక్రెయిన్లోని ఒక్కో నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలైన కీవ్ ను ఇప్పటికే చేజిక్కించుకోగా.. మేరియుపోల్ కూడా రష్యా వశమైనట్లే కనిపిస్తోంది.

రష్యా సేనలు మేరియుపోల్ నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేసి ఏప్రిల్ లోనే ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు ప్రకటించారు. కానీ ఇక్కడున్న అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ను దక్కించుకోలేకపోయారు. తాజాగా దానీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక పుతిన్ సేనలు కొత్త ప్రాంతంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇదే ఊపులో రష్యా ముందుకు వెళ్తే రాను రాను ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవడం రష్యాకు ఏమంత పెద్ద పనికాదని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఉక్రెయిన్లోని మేరియుపోల్ అజోవ్ సముద్రం ఒడ్డున ఉంది. ఈ నగరంలో 4 లక్షల 50 వేల జనాభా నివసిస్తోంది. 18వ శతాబ్దం నుంచి వ్యాపార కేంద్రంగా కొనసాగుతోంది. 2014లో క్రిమియాను ఆక్రమించుకున్న రష్యా డాన్ బాస్ ప్రాంతాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. అయితే మేరియపోల్ క్రిమియా, డాన్ బాస్ నగగాల మధ్యలో ఉంది. దీంతో మేరియుపోల్ ను ఆక్రమించుకోవడం రష్యాకు ఈజీగా మారింది. అంతకుముందు మేరియుపోల్ ను రష్యాకు మద్దతుగా ఉన్న వేర్పాటువాదులు ఆక్రమించుకున్నా.. అతివాద గ్రూప్ అజోవ్ బెటాలియన్, డెనిప్రో-1 బెటాలియన్ల సాయంతో ఉక్రెయిన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

ఇప్పుడు ఉక్రెయిన్ ఆక్రమణలో భాగంగా మేరియుపోల్ పై దాడి చేసేందుకు రష్యా భారీ ఏర్పాట్లతో రంగంలోకి దిగింది. మొదటి నుంచే కీవ్ పై విరుచుకుపడిన రష్యాను మేరియుపోల్ ను రక్షించుకునేంత సమయం ఇవ్వలేదు. రోజుల తరబడి కీవ్ ను చుట్టుముట్టి కిలోమీటర్ల కొద్దీ యుద్ధ ట్యాంకులను ఏర్పాటు చేశారు. అయితే ఉక్రెయిన్ సేనలు కీవ్ పై దృష్టి పెట్టారు.

రాజధానిని రక్షించుకుంటే చాలు అన్నంత పనిచేశారు. కానీ పుతిన్ సేనలు మేరియుపోల్ పై ఏకకాలంలో దాడులు కొనసాగించారు. దీంతో దాదాపు నగరం నేలమట్టమైంది. విద్యుత్తు, ఆహార ఇతర సదుపాయాలు కరువు కావడంతో స్థానిక ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. మేరియు పోల్ పై జరిగిన దాడిలో 20 వేలకు పైగానే పౌరులు చనిపోయినట్లు అంచనా వేస్తున్నారు.

ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకునే ఉద్దేశం తమకు లేదని చెబుతూనే.. అందుకు విరుద్ధంగా భారీగా యుద్ధ ట్యాంకులను నెలకొల్పారు. ఉక్రెయిన్ సేతలు ఎదురొడ్డి పోరాడుతున్న లెక్కచేయకుండా ముందుకు వెళ్లారు. ముందుగా మేరియుపోల్ లోని అజోవ్ రెజిమెంట్, ఆ తరువాత స్టీల్ ప్లాంట్ ను స్వాధీనం చేసుకోవడంతో ఉక్రెయిన్ సైనికులు రష్యా బలగాల ముందు లొంగిపోవాల్సి వచ్చింది. అజోవ్ సముద్రం ఒడ్డున ఉన్న మేరియుపోల్ ను కోల్పోవడంతో ఉక్రెయిన్ భారీగా సముద్రతీరాన్ని నష్టపోయింది. ఈ దేశానికి ఉన్న అతి పెద్ద పోర్టు మేరియుపోల్ లోనే ఉంది. ఈ నగరాన్ని కోల్పోవడంతో ఉక్రెయిన్ కు కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది.