Begin typing your search above and press return to search.

కరోనా కోసం కదిలివచ్చిన హోటల్స్ ఇండస్ట్రీ

By:  Tupaki Desk   |   4 April 2020 11:50 AM GMT
కరోనా కోసం కదిలివచ్చిన హోటల్స్ ఇండస్ట్రీ
X
కరోనా సంక్షోభంతో దేశంలో అన్ని వ్యాపార - వాణిజ్యాలు కుప్పకూలాయి. జనాలంతా లాక్ డౌన్ తో ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక ప్రధానంగా హోటళ్ల వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కరోనా భయంతో జనాలు రాకపోవడం.. స్టే చేయకపోవడంతో దానికి అనుబంధంగా ఉండే రెస్టారెంట్స్ - హోటల్ పరిశ్రమలు పూర్తిగా కుదేలైన పరిస్థితి కనిపిస్తోంది.

ఇప్పుడు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న లగ్జరీ, మీడియా హోటల్స్ ను వాడుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. వీటిని వైద్య సిబ్బందికి వసతులు కల్పించడానికి.. కొందరు రోగులను క్వారంటైన్ కు తరలించడానికి వినియోగించుకోవాలని ఆలోచిస్తోంది.

ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా తమ హోటల్స్ ఇవ్వడానికి ప్రముఖ ప్రఖ్యాత హోటల్స్ ముందుకు రావడం విశేషంగా మారింది. దేశంలోనే బడా హోటల్స్ అయిన ఐటీసీ - ఇండియన్ హోటల్స్ కంపెనీ (ఐహెచ్ .సీ.ఎల్) , ది లలిత్ - లెమన్ ట్రీ మరియు ఇతరులకు చెందిన దేశవ్యాప్తంగా ఉన్న 45000 హోటల్ గదులు ఈ క్లిష్ట సమయంలో తమ ఖాళీ గదులను వాడుకోవాలని పర్యాటక మంత్రిత్వశాఖకు ఆఫర్ ఇచ్చాయి. ఈ మేరకు సంప్రదింపులు జరుగుతున్నాయి. కొన్ని గదులను తక్కువ రేటుతో.. మరికొన్నింటిని రాయితీతో ఇవ్వడానికి హోటల్స్ ఒప్పుకున్నాయి.

అంతర్జాతీయంగా విమాన సర్వీసులు బంద్ కావడంతో ఇప్పుడు హోటల్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. చిక్కుకుపోయిన విదేశీ పర్యాటకులకు ప్రభుత్వం ఆహారం అందిస్తోంది. హోటళ్లు సైతం ఉచితంగా ఆహారమందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని వాడుకునే వెసులుబాటును ప్రభుత్వానికి కల్పించాయి.