దివ్యపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోం: హోంమంత్రి

Sat Oct 17 2020 23:05:44 GMT+0530 (IST)

Home Minister Gave Serious Warning To Netizens

విజయవాడలో యువతి దారుణ హత్య కేసులో సంచలన నిజాలు  వెలుగుచూస్తున్నాయి.. క్రీస్తురాజపురం ప్రాంతానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని ప్రేమ పేరుతో వేధించిన నాగేంద్రబాబు.. గురువారం ఆమెపై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచాడు. చికిత్స పొందుతూ దివ్య మృతి చెందడం విషాదం నింపింది.ఉన్మాది స్వామి చేతిలో దివ్య తేజస్విని అనే అమ్మాయి బలి అయిపోవడంపై మహిళా సంఘాలు ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి.  అయితే కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో దివ్యకి నాగేంద్రకి పెళ్లి అయ్యిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.  

అయితే దివ్యకు పెళ్లి అయ్యిందనే విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు ఖండిస్తున్నారు. జూన్ లో నాగేంద్ర తనకు ఫోన్ చేసిన సందర్భంలోనే అతడు దివ్యను ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసిందని వారు తెలిపారు. కేసు నుంచి తప్పించుకునేందుకే దివ్యతో కలిసి ఉన్నట్లుగా కొన్ని వీడియోలను రిలీజ్ చేశారని దివ్య తండ్రి ఆరోపించాడు. దివ్యకు పెళ్లి కాలేదని స్పష్టం చేస్తున్నారు.

అయితే 2018 మార్చిలో మంగళగిరి పానకాల స్వామి గుడికి దివ్య నాగేంద్ర వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే పెళ్లి అయ్యిందా లేదా అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

పోలీసులు దివ్య తన వీడియోలో చెప్పినదాని ప్రకారం.. ఈ ఏడాది లాక్ డౌన్ విధించే వరకు దివ్య-నాగేంద్ర టచ్ లోనే ఉన్నట్టు భావిస్తున్నారు. నాగేంద్ర సైకో కోణాన్ని గమనించి దివ్య బ్లాక్ చేసిందని.. ఇది తట్టుకోలేకే దివ్యను నాగేంద్ర వేధిస్తున్నాడని తెలిపింది. అయితే ఈ విషయాన్ని దివ్య తల్లిదండ్రులకు చెప్పి ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదని పోలీసులు భావిస్తున్నారు. అయితే నాగేంద్ర మాత్రం తనకు దివ్య 13 ఏళ్ల నుంచి పరిచయం అని చెప్పినట్టు సమాచారం.

దివ్య కుటుంబ సభ్యులను హోంమంత్రి సుచిరిత పరామర్శించారు. దోషులకు కఠిన చర్యలు తీసుకుంటామంటూ భరోసా ఇచ్చారు. ఏపీలో మహిళలకు ఏమైనా అయితే వదిలేది లేదని హోమంత్రి సుచరిత చాలా గట్టిగా హెచ్చరించారు..  ఇటు జగన్ సర్కార్ కూడా దిశ చట్టం అమలు చేశాక మహిళలపై నేరాల విషయంలో సీరియస్ గా ముందుకెళుతోంది.