పవన్ కళ్యాణ్ ను హోమం గెలిపిస్తుందా?

Sun May 19 2019 14:40:06 GMT+0530 (IST)

Homam Performed for Pawan Kalyan Win

సెంటిమెంట్లు అందరికీ ఉంటాయి.. ఒక్కొక్కరు ఒక్కో సెంటిమెంట్ ను ఫాలో అవుతుంటారు. ఎన్నికలవేళ అయితే అవి ఇంకా పీక్ స్టేజ్ లో ఉంటాయి. తమ గెలుపు కోసం నాయకులు చేయని పని ఉండదు. ఇక గెలుపుపై అనుమానంగా ఉన్న వారు హోమాలు యజ్ఞాలు చేయిస్తుంటారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే డిసెంబర్లో ఎన్నికలకు ముందు పెద్ద యాగమే చేశారు. ఆ యాగ ఫలమో లేక ప్రజాబలమో కానీ ఆయన గద్దెనెక్కారు.ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గెలుపు కోసం కూడా అలాంటి హోమమే జరిపించాడన్న టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన త్రివిక్రమ్.. జనసేన గెలుపు కోసం   ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నరసింహంతో కలిసి పెద్ద హోమం నిర్వహించాడన్న వార్త తాజాగా చక్కర్లు కొడుతోంది. అయితే ఆ యాగం ఎప్పుడో పూర్తయినా ఇప్పుడు వార్త లీక్ కావడం విశేషం.

ఆ ఆధ్యాత్మిక గురువు నరసింహం దర్శకుడు త్రివిక్రమ్ కు బాగా తెలిసిన వాడట. త్రివిక్రమ్ చాలా సార్లు తన బాగోగుల కోసం పూజలు యాగాలు ఆయన చేతే చేయించేవాడట.. ఆయన హస్తవాసి మంచిది కావడంతో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కూడా ఇలానే హోమం నిర్వహించాడని తెలిసింది.

పవన్ కళ్యాణ్ సారథ్యంలో జనసేన ఏపీలో పోటీచేసింది. సర్వేల ప్రకారం ఆయన పార్టీకి 5 లోపే సీట్లు వస్తాయని అంటున్నారు. పవన్ స్వయంగా పోటీచేసిన భీమవరం గాజువాకలో కూడా నెగెటివ్ రిపోర్ట్ వస్తున్నాయట.. అందుకే ఆ చెడు దృష్టిని పారద్రోలేందుకు త్రివిక్రమ్ ఈ హోమం నిర్వహించాడని వార్తలు బయటకు వచ్చాయి.

ఈ హోమం నిర్వహించడానికి భారీగానే ఖర్చు చేసినట్టు సమాచారం. 50వేల విలువగల చీర బంగారు వెండి నగలు విలువైన వజ్రాలు రంగురాళ్లను హోమంలో భాగంగా నిర్వహించే పూర్ణాహుతిలో శాంతి కోసం అర్పించినట్టు తెలిసింది.

ఈ హోమం నిర్వహించిన అనంతరం సదురు నరసింహం గురువు పవన్ కళ్యాణ్ పార్టీ గెలుపుపై భరోసా ఇచ్చినట్టు తెలిసింది. ఖచ్చితంగా ఏపీలో జనసేన 25 సీట్లు గెలుచుకుంటుందని.. కింగ్ మేకర్ అవుతాడని అభయమిచ్చాడట.. ఇదే గనుక జరిగితే గురువును ఘనంగా సత్కారిస్తామని వారు బదులిచిచ్చినట్టు తెలిసింది. మరి పవన్ కోసం నిర్వహించిన హోమం ఫలిస్తుందా? పవన్ 25 సీట్లు గెలుస్తాడా అన్నది మే 23న తేలనుంది.