హాలోవీన్: ఆత్మలకు ఈరోజు అంకితం

Sat Oct 31 2020 23:10:37 GMT+0530 (IST)

Halloween: Today is dedicated to souls

సంవత్సరంలో ఒకరోజు మనం చనిపోయిన మన కుటుంబ పెద్దలకు ఎలా అయితే అర్పణాలు సమర్పిస్తారు. విదేశాల్లోనూ మరణించిన వారిని స్మరించుకునే రోజు ఒకటి ఉంది. దాన్నే ‘హాలోవీన్ ఫెస్టివల్’ అంటారు. ఇది విదేశాల్లో చాలా ఫేమస్ పండుగ.ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న అంటే ఈరోజే దీన్ని జరుపుకుంటారు. చనిపోయిన వారిని స్మరిస్తూ ఈరోజును వారికి అంకితం ఇస్తారు. విదేశాల్లో దీన్ని చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు.

కాకపోతే ఈ పండుగ కొంచెం భయానకంగా ఉంటుంది. అసంతృప్తితో ఉన్న ఆత్మలకు నూతన సంవత్సరంగా దీన్ని భావిస్తారు.

ఈ పండుగ నాడు గుమ్మడికాయలను దయ్యాల ఆకారాల్లో తీర్చిదిద్దుతారు. అందులో కొవ్వొత్తులు ముట్టిస్తారు. ఇలా చేస్తే ఆత్మలు ఇంట్లోకి ప్రవేశించవని వారి నమ్మకం.

ఈ పండుగ నాడు గుమ్మడి కాయలు దెయ్యాలను పోలి వెలుతురుతో కనిపిస్తుంటే చూడడానికి భయానకంగానే ఉంటుంది.కొత్తవారు వస్తే భయపడేలానే కనిపిస్తుంది.కానీ దీన్ని పెద్ద పండుగలాగా విదేశాల్లో నిర్వహిస్తారు.