Begin typing your search above and press return to search.

హిండెన్‌బ‌ర్గ్ ఎఫెక్ట్‌.. అదానీ సంప‌ద 8 ల‌క్ష‌ల కోట్లు ఆవిరి!

By:  Tupaki Desk   |   2 Feb 2023 10:03 PM GMT
హిండెన్‌బ‌ర్గ్ ఎఫెక్ట్‌.. అదానీ సంప‌ద 8 ల‌క్ష‌ల కోట్లు ఆవిరి!
X
అదానీ.. ఈ పేరు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మోడీ హ‌యాంలో పెద్ద ఎత్తున వినిపించిన వినిపిస్తున్న రెండు పేర్ల‌లో అదానీ ఒక‌రు. అయితే.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు దూకుడు.. బాగానే ఉన్న‌ప్ప‌టి కీ.. ఇప్పుడు అదానీ ప‌రిస్థితి ఇబ్బందుల్లో ప‌డిపోయింది. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంస్థ వెల్లించిన ఓ నివేదిక‌.. ఈ ప‌రంప‌ర‌లో అదానీ దానికి స‌మాధానం ఇవ్వ‌డం వంటివి.. చూస్తే.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య వివాదం తార స్థాయికి చేరింది.

అయితే.. తాజాగా ఈ నివేదికతో అదానీ గ్రూప్ షేర్లు భారీ న‌ష్టాల‌ను చ‌విచూశాయి. జనవరి నుంచి అదానీ గ్రూప్‌ సంస్థలు రూ.8 లక్షల కోట్లకుపైగా నష్టపోయాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సహా ఆ గ్రూప్‌నకు చెందిన స్టాక్స్‌ భారీగా పతనమయ్యాయి. మరోవైపు.. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు, స్టాక్‌ మార్కెట్‌లో ఆ గ్రూప్‌ షేర్ల పతనంతో ఆర్బీఐ రంగంలోకి దిగింది.

అదానీ గ్రూప్‌ సంస్థల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికాకు చెందిన పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్ వెలువరించిన నివేదిక ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఆ నివేదికతో అదానీ గ్రూప్‌ సంస్థల వాటాలు స్టాక్‌ మార్కెట్లలో తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి చవిచూస్తున్నాయి.

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ తరఫున తీసుకొచ్చిన ఎఫ్పీఓను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించిన ఆ సంస్థ అధిపతి గౌతమ్‌ అదానీ.. తమ సంస్థ మూలాలు బలంగానే ఉన్నాయని స్వయంగా ప్రకటించినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించలేదు.

ఇవీ.. భారీ దెబ్బ‌లు!

+ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ సహా దాదాపు అన్ని కంపెనీలు గురువారం భారీ నష్టాలు చవిచూశాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఏకంగా 26శాతానికిపైగా పతనమైంది. ఎఫ్పీఓను వెనక్కు తీసుకోవడం.. ఈ సంస్థకు భారీ నష్టాన్ని కలిగించింది.

+ అదానీ విల్‌మార్‌, అదానీ టోటల్‌ గ్యాస్, అదానీ పవర్, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ కూడా భారీ న‌ష్టాల‌ను చ‌విచూశాయి. స్టాక్‌ మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి కారణంగా అదానీ గ్రూప్‌ సంస్థల సంపద రూ.8 లక్షల కోట్లకుపైగా ఆవిరైంది.

+ దానీ గ్రూప్‌ కంపెనీలకు చెందిన సెక్యూరిటీస్‌పై తమ క్లయింట్లకు ఎలాంటి మార్జిన్‌ రుణాలు ఇవ్వకూడదని సిటీ గ్రూప్‌నకు చెందిన వెల్త్‌ యూనిట్‌ నిర్ణయించింది.

+ క్రెడిట్‌ సూయిజ్‌ ఏజీ సైతం అదానీ గ్రూప్‌ బాండ్లపై రుణాలు ఇవ్వడాన్ని నిలిపివేసింది. బాండ్లకు విలువను జీరోగా పేర్కొంది.

+ అదానీ గ్రూప్‌పై హిండెన్‌ బర్గ్‌ ఆరోపణలు, స్టాక్‌ మార్కెట్‌లో ఆ గ్రూప్‌ షేర్ల పతనం కొనసాగుతున్న వేళ.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రంగ ప్రవేశం చేసింది. అదానీ గ్రూప్‌ కంపెనీలకు.. ఏఏ బ్యాంకులు ఎంత రుణం ఇచ్చాయనే అంశంపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

+ గురువారం ట్రేడింగ్ విషయానికి వస్తే.. అదానీ ఎంటర్ ప్రైజస్ షేరు 26 శాతం, అదానీ పోర్ట్స్ 7 శాతం.. అదానీ ట్రాన్స్ మిషన్ 10 శాతం.. అదానీ గ్రీన్ ఎనర్జీ 10 వాతం.. అదానీ టోటల్ గ్యాస్ 10 శాతం.. అదానీ విల్మార్ 5 శాతం.. ఎన్డీటీవీ 5 శాతం.. అదానీ పవర్ 4.9 శాతం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.