అక్టోబర్ 1 నుండి ఉన్నత విద్యాసంస్థలు ప్రారంభం

Tue Sep 14 2021 13:14:08 GMT+0530 (IST)

Higher education institutions start from October 1st

కరోనా వైరస్ విజృంభణ కారణంగా విద్యా సంస్థలు మూతపడిన విషయం తెలిసిందే. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ విద్యా సంస్థలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో అక్టోబరు 1 నుంచి ఉన్నత విద్యాసంస్థలను పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఉమ్మడి అకడమిక్ కేలండర్‌ను విడుదల చేసింది. సాధారణ డిగ్రీ పీజీ కళాశాలల్లో అక్టోబరు 1వ తేదీ నుంచి సెమిస్టర్-135 తరగతులు ప్రారంభం కానున్నాయి. జనవరి 24 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి సెమిస్టర్-246కు సంబంధించిన తరగతులు జరుగనున్నాయి.జూన్ 1వ తేదీ నుంచి పరీక్షలు జరుగనున్నాయి. కాగా రెండో సెమిస్టర్ తర్వాత కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టుకు నాలుగో సెమిస్టర్ తర్వాత వేసవి ఇంటర్న్‌షిప్ అప్రెంటిస్ షిప్ కు 8 వారాల సమయం ఉంటుంది. ఇక టెక్ బీ ఫార్మసీ కోర్సులకు అక్టోబరు 1వ తేదీ నుంచి సెమిస్టర్-1357కు సంబంధించిన తరగతులు నిర్వహిస్తారు. జనవరి 24 నుంచి సెమిస్టర్-3 పరీక్షలు జరుగనున్నాయి. ఫిబ్రవరి7 నుంచి సెమిస్టర్-157 ముగింపు పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి1వ తేదీ నుంచి సెమిస్టర్-268 కు సంబంధించిన తరగులు పునఃప్రారంభం కానున్నాయి. జూన్ 23వ తేదీ నుంచి ముగింపు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఫిబ్రవరి 15వ తేదీ నుంచి నాలుగో సెమిస్టర్ ప్రారంభం కానుంది. జూన్1వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నాలుగో సెమిస్టర్ తర్వాత కమ్యూనిటీ సర్వీసు ప్రాజెక్టుకు 8వారాల సమయం ఉంటుంది. పీజీ కోర్సులకు నవంబరు ఒకటి నుంచి తరగతులు ప్రారంభించనున్నారు. మార్చి1వ తేదీ నుంచి సెమిస్టర్-135 పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 14వ తేదీ నుంచి 246 తరగతులు ప్రారంభించనున్నారు. జులై 4వ తేదీ నుంచి ముగింపు పరీక్షలు జరుగనున్నాయి.