మళ్లీ కోర్టు మెట్లెక్కనున్న ఏపీ డీజీపీ.. ఈ సారి రీజన్ ఇదే!

Thu Sep 29 2022 07:00:01 GMT+0530 (India Standard Time)

High court on ap DGP

సాధారణంగా.. ఏఐఎస్ ఐపీఎస్‌లు.. కోర్టుకు వెళ్లడం అనేది చాలా చాలా అరుదైన సందర్భాల్లోనే జరుగు తుంది. ఎంతో ముఖ్యమైన కేసుల్లోనే కోర్టులు.. ఇలాంటి అధికారులను హాజరు కోరతాయి. మరి ఇదేం పరిస్థితో తెలియదు కానీ.. ఏపీలో మాత్రం తరచుగా.. డీజీపీలు.. ఐపీఎస్‌లు.. కోర్టు మెట్టెక్కుతున్నారు. గతంలో డీజీపీగా ఉన్న సవాంగ్.. అనేకసార్లు.. కోర్టు మెట్టెక్కారు. ఇక ఐఏఎస్‌లు తరచుగా వెళ్తూనే ఉన్నారు. ఇలా.. ఏదోఒక కేసులో వారుకోర్టుకు వెళ్లడం.. వివాదంగా మారుతోంది.తాజాగా..ఇప్పుడు ప్రస్తుతం డీజీపీ.. హైకోర్టు కోర్టుకు రావాలంటూ.. ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన.. కోర్టు.. ఏపీ పోలీసులపై తీవ్రస్థాయిలో మండిపడింది. పోలీసులను అదుపులో పెట్టుకోలేరా? అంటూ.. డీజీపీని నిలదీసింది. నిబంధనలు తెలుసా? అంటూ.. ప్రశ్నించింది. తదుపరి విచారణకు కోర్టుకు వచ్చి. వివరణ ఇవ్వాలని.. కోర్టు ఆదేశాలు జారీచేసింది.

ఏం జరిగింది..?

రేషన్ బియ్యం పేరుతో రైస్ మిల్లర్లను వాహనదారులను పోలీసులు వేధించడంపై కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన సౌదామిని వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసులు నిబంధనల కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పిటీషనర్ ఆరోపించారు. నిబంధనలకు వ్యతిరేకంగా రైస్ మిల్లులోని 5 వాహనాలను పోలీసులు సీజ్ చేశారని తెలిపారు. అయితే అక్రమ బియ్యం రవాణా జరుగుతోందని ప్రభుత్వ లాయర్ వాదించారు.

ఈ సమయంలో  జోక్యం చేసుకున్న పిటిషనర్ తరఫున లాయర్.. అక్రమాలు జరిగితే చట్టం నిబంధనల ప్రకారం నడుచుకోవాని ...ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఎలా సీజ్ చేస్తారని పిటీషనర్ తరఫు లాయర్ అన్నారు.

తగిన ఉత్తర్వులు జారీ చేయాలని గతంలో అనేకసార్లు డీజీపీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. అధికారులు ఎందుకు నిబంధనలు పాటించడం లేదో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఏపీ డీజీపీ స్వయంగా కోర్టుకు హాజరు అయి వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.