Begin typing your search above and press return to search.

హై అలర్ట్ః హైద‌రాబాద్ లో గ్యాంగ్‌.. ఆ మ‌హిళ‌లే టార్గెట్‌.. ప్ర‌క‌టించిన పోలీసులు!

By:  Tupaki Desk   |   23 Feb 2021 9:42 AM GMT
హై అలర్ట్ః హైద‌రాబాద్ లో గ్యాంగ్‌.. ఆ మ‌హిళ‌లే టార్గెట్‌.. ప్ర‌క‌టించిన పోలీసులు!
X
కొన్ని రోజులుగా హైదరాబాద్‌ శివార్లలో ఓ గ్యాంగ్ దారుణ‌మైన నేరాల‌కు పాల్ప‌డుతోంది. కానీ.. ఆ విష‌యాలు, వివ‌రాలు మాత్రం బ‌య‌ట‌కు రావ‌ట్లేదు. ఆ మాట‌కొస్తే.. పోలీస్టేష‌న్ వ‌రకు కూడా వెళ్ల‌ట్లేదు. ప్ర‌త్యేకంగా ఒకే ర‌క‌మైన మ‌హిళ‌ల‌ను టార్గెట్ చేస్తున్న ఆ ముఠా.. డ‌బ్బుల‌తోపాటు అన్నీ దోచుకెళ్తున్నారు. ఇటీవ‌ల తీవ్ర‌మైన ఈ నేరాల‌కు సంబంధించిన స‌మాచారం తాజాగా పోలీసుల‌కు అందింది. దీంతో.. అల‌ర్ట్ గా ఉండాల‌ని సూచిస్తున్నారు.

ఈ నేరాల‌కు పాల్ప‌డుతున్న ముఠా స‌భ్యులు.. ఆడ‌వాళ్ల‌ను మాత్ర‌మే టార్గెట్ చేస్తున్నారు. అందులోనూ ఒకే వ‌ర్గానికి చెందిన వారిని ఎంచుకుంటున్నారు. వారు ఎవ‌రంటే.. పార్టీల‌కు, ప‌బ్ ల‌కు వెళ్లే యువ‌తులు. వీరితో మార్గం మ‌ధ్య‌లో కావొచ్చు.. లేదంటే పార్టీ ప్ర‌దేశాల్లో కావొచ్చు.. ప‌రిచ‌యాలు చేసుకుంటున్నారు. ఆ త‌ర్వాత మంచిగామాట క‌లుపుతూ పార్టీలో చేరిపోతారు. అక్క‌డ తాగే కూల్ డ్రింకుల్లో మ‌త్తుమందు క‌లుపుతున్నారు.

అలా మత్తులోకి జారుకున్న వారి నుంచి అన్నీ దోచుకుంటున్నారు. ఆ త‌ర్వాత వారిపై అత్యాచారాలు కూడా చేసి, వీడియోలు, ఫోటోలు చిత్రీక‌రిస్తున్నారు. వారు క‌లుపుతున్న మ‌త్తు మందుతో దాదాపు మూడు గంట‌ల‌పాటు కాన్షియ‌స్ లో లేకుండాపోతున్నారు బాధితులు. ఈ గ్యాప్ లో వాళ్ల ఇష్టానుసారం చేసి, వీడియోలు తీసి, వాటితో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారు. బాధితురాళ్లకు ఫోన్లు చేస్తూ డబ్బులు గుంజుతున్నారు. ఇవ్వ‌క‌పోతే ఆ వీడియోలు, ఫోటోలను కుటుంబసభ్యులకు పంపిస్తామని, ఇంట‌ర్నెట్ లో పోస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు.

ఈ విధంగా.. ఇప్ప‌టికే చాలా మంది బాధితులుగా మారిన‌ట్టు స‌మాచారం. కానీ.. ప‌రువు పోతుంద‌ని స‌ద‌రు యువతులు బయ‌ట‌కు చెప్పుకోలేక‌పోతున్నార‌ట‌. కాగా.. టీవల ఇలాంటి ఘటనపై పోలీసుల‌కు ఫిర్యాదులు అందాయ‌ట‌. దీంతో.. హైదరాబాద్ నగరంలోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు. అంతేకాదు.. త‌ల్లిదండ్రుల‌కు కూడా సూచ‌న‌లు చేస్తున్నారు.

పిల్లలను పబ్‌లకు, పార్టీలకు పంపించే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాల‌ని హెచ్చ‌రిస్తున్నారు. న‌ష్టం జ‌రిగిన త‌ర్వాత బాధ‌ప‌డి ప్ర‌యోజ‌నం లేద‌ని, ముందుగానే మేల్కోవాల‌ని సూచిస్తున్నారు. ప్ర‌ధానంగా.. మిడ్‌నైట్ పార్టీలకు వెళ్లే యువతులు ఈ విష‌యంలో అల‌ర్ట్ గా ఉండాల‌ని చెబుతున్నారు పోలీసులు. రాత్రివేళ అపరిచిత వ్యక్తులు మాటలు కలిపితే స్పందించొద్ద‌ని సూచిస్తున్నారు.