Begin typing your search above and press return to search.

టీటీడీ ఆస్తుల లెక్క ఐదురోజుల్లో చెప్పాలి: హైకోర్టు కీలక ఉత్తర్వులు

By:  Tupaki Desk   |   26 Feb 2021 6:00 AM GMT
టీటీడీ ఆస్తుల లెక్క ఐదురోజుల్లో చెప్పాలి: హైకోర్టు కీలక ఉత్తర్వులు
X
టీటీడీ ఆస్తుల లెక్క చెప్పాలని హైకోర్టు కీలక ఆదేశాల జారీ చేసింది. ఇందుకు ఐదురోజులు గడువు ఇస్తూ విచారణను మార్చి 2వ తేదికి వాయిదా వేసింది. దీంతో టీటీడీ ఆస్తుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది.

ఇప్పటివరకు టీటీడీ ఆస్తుల పరిరక్షణ కోసం కమిటీ ఎలాంటి చర్యలు తీసుకుందో తెలియజేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను మార్చి 2వ తేదికి వాయిదా వేసింది. దీంతో టీటీడీకి సంబంధించిన ఆస్తుల వివరాలను ఐదురోజుల్లో హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది.

టీటీడీ ఆస్తుల వేలం వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. దేశ విదేశాల నుంచి వెంకన్న స్వామికి భారీగా నగదు, కానుకలు వస్తుంటాయి. వీటికి తోడు స్వామి వారి పేరుతో భారీగా ఆస్తులు ఉన్నాయి. అందుకే టీటీడీ ఆస్తులు వేలం వేయాలనే ప్రభుత్వం నిర్ణయంపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ప్రభుత్వం తీరుపై అనుమానంతో పలువురు కోర్టును ఆశ్రయించారు.

విచారణ చేపట్టిన కోర్టు.. టీటీడీకి చెందిన ఆస్తులపై అఫిడవిట్ రూపంలో వివరాలను అందించాలని ఆదేశించింది. ఈ విషయమై టీటీడీ ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి. తదుపరి విచారణను మార్చి 2వ తేదికి వాయిదా వేసింది కోర్టు.