Begin typing your search above and press return to search.

దేశ రాజధానిలో హెర్డ్ ఇమ్యూనిటీ కోసం ట్రై చేస్తే డేంజర్

By:  Tupaki Desk   |   16 Oct 2021 3:36 AM GMT
దేశ రాజధానిలో హెర్డ్ ఇమ్యూనిటీ కోసం ట్రై చేస్తే డేంజర్
X
‘హెర్డ్ ఇమ్యునిటీ’ అనే మాటకు గతంలో చాలామందికి తెలీకపోవచ్చు. కరోనా కారణంగా ఇప్పుడీ మాటకు అర్థం చిన్న పిల్లాడికి సైతం అర్థమయ్యే పరిస్థితి. కరోనా నుంచి బయటపడేందుకు ఒకటి ఎవరూ దాని బారిన పడకుండా ఉండటం. లేదంటే.. అందరూ దాన్ని తట్టుకునే శక్తిని కలిగి ఉండటం. సామూహికంగా కొవిడ్ వైరస్ ను అధిగమించేంత రోగ నిరోధక శక్తి సంపాదిస్తే.. కరోనాకు చెక్ చెప్పే వీలుంది. ఇప్పటికే దేశంలోని పలు నగరాల్లో ప్రజలకు హెర్డ్ ఇమ్యునిటీ ఎక్కువ కావటంతో కేసుల నమోదు తగ్గినట్లుగా చెబుతున్నారు.

అదే సమయంలో కేరళలో ఈ హెర్డ్ ఇమ్యునిటీ తక్కువగా ఉన్న కారణంగానే.. సెకండ్ వేవ్ ఆలస్యంగా మొదలుకావటమే కాదు.. భారీ ఎత్తున కేసులు నమోదైనట్లుగా చెప్పాలి. అయితే.. దేశ రాజధాని ఢిల్లీలో హెర్డ్ ఇమ్యునిటీ చాలా కష్టమని అంతర్జాతీయ శాస్త్రవేత్తల టీం ఒకటి స్పష్టం చేస్తుంది. దీని కోసం ట్రై చేస్తే డెల్టాబారిన పడటం లేదంటే.. బూస్టర్ డోసులు తీసుకోవటమే పరిష్కారమని పేర్కొంది.

2020 నవంబరులో ఢిల్లీలో ప్రతి రోజు 9 వేల కేసులు నమోదు కాగా.. ఆ తర్వాత తగ్గాయి. ఆ తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. మార్చిలో 2వేలకు పైగా కేసులు నమోదైతే.. ఏప్రిల్ లో వీటి సంఖ్య 20వేలకు పెరిగాయి. తర్వాతి రోజుల్లో వేలల్లో కేసులు నమోదు అవుతూ.. పెద్ద ఎత్తున ప్రజలు మరణించటం తెలిసిందే. ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క హాస్పిటల్ ఆవరణలోనే ప్రాణాలు విడిచిన వైనాలు ఎన్నో ఢిల్లీలో చోటు చేసుకోవటం తెలిసిందే. ఇలాంటి పరిస్థితులు ఉన్న వేళ.. హెర్డ్ ఇమన్యూనిటీ పై అధ్యయనం చేపట్టారు.

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్.. కేంబ్రిడ్జి వర్సిటీ.. ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్.. కోపెన్ హాగెన్ వర్సిటీకి చెందిన సైంటిస్టుల టీంతో సహా మరికొందరు చేసిన ఈ అధ్యయనంలో తేల్చిన అంశాలేమంటే..

- 202లో ఢిల్లీలో కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందటానికి కారణమైన వేరియంట్ ఏమిటో స్పష్టంగా చెప్పలేం. కొన్ని కేసుల్లో అల్ఫా వేరియంట్ బయటపడింది. అది కూడా విదేశీ ప్రయాణికుల్లోనే ఎక్కువగా కనిపించింది.

- 2021 మార్చి నాటికి ఢిల్లీలో ఈ వేరియంట్ కేసులు 40 శాతం వెలుగు చూశాయి. ఏప్రిల్ లో డెల్టా కేసులు భారీగా పెరిగిపోయాయి. కేంబ్రిడ్జివర్సిటీ శాస్త్రవేత్త రవి గుప్తా అంచనా ప్రకారం అంటువ్యాధుల్ని అంతం చేయటానికి హెర్డ్ ఇమ్యునిటీ కీలకంగా ఉంటుంది. కానీ.. ఢిల్లీ వాసులపై గత వేరియంట్లు చూపిన ప్రభావం ప్రజల హెర్డ్ ఇమన్యూనిటీ సాధించేందుకు సరిపోదు.

- అయితే.. డెల్టా వేరియంట్ సోకి దాని నుంచి కోలుకోవటం కానీ.. లేదంటే బూస్టర్ డోసు ద్వారా హెర్డ్ ఇమ్యునిటీని పెంచుకోవటమే మిగిలింది.