Begin typing your search above and press return to search.

హీరా గోల్డ్ కేసు: భారీగా ఆస్తులు స్వాధీనం

By:  Tupaki Desk   |   9 Aug 2020 5:30 PM GMT
హీరా గోల్డ్ కేసు: భారీగా ఆస్తులు స్వాధీనం
X
హీరా గోల్డ్ కుంభకోణం కేసులో కేంద్రంలోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును వేగవంతం చేసింది. నౌహీరా షేక్ కు సంబంధించిన ఆస్తులను ఒక్కొక్కటిగా అటాచ్ చేసుకుంటూ వెళ్తోంది.

తాజాగా ప్రధాన నిందితురాలు నౌహీరా షేక్ కు చెందిన మరికొన్ని భూములను ఈడీ స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ షేక్ పేట ఎస్ఏ కాలనీలో రూ.71కోట్ల విలువైన 81 ప్లాట్లను రెవెన్యూ పోలీసు అధికారుల సాయంతో జప్తు చేసింది.

ఈ కేసులో ఇప్పటివరకు రూ.300 కోట్ల ఆస్తులను ఈడీ ఆధీనంలోకి తీసుకుంది. ఇంకా రూ.600కోట్ల పైచిలుకు ఆస్తులను ఈడీ అటాచ్ చేసినట్లు తెలిసింది.

ఇప్పటికే ఈ హీరా గోల్డ్ కుంభకోణం రూ.5600 కోట్లుగా తేలింది. దీనిపై నౌహీరా షేక్ పై దేశవ్యాప్తంగా 60 కేసులు నమోదయ్యాయి. ఈ కుంభకోణంపై ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేస్తోంది.