చావకముందే మరణశాసనం రాసుకున్నాడు

Sun Oct 18 2020 20:00:51 GMT+0530 (IST)

He wrote an obituary before he died

చావకముందే డెత్ యానివర్సిరీ కోసం ఓ వ్యక్తి రాసుకున్న పోస్ట్ వైరల్ అయ్యింది. ఇంటర్నెట్ లో ఇదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందరినీ కంటతడి పెట్టిస్తోంది.చెన్నైకి చెందిన ఇజ్జి కే ఉమామహేష్  శుక్రవారం మృతిచెందాడు. అయితే తన మరణానంతరం ప్రకటనల్లో ప్రచురించాల్సిన అంశాలను ముందుగానే రాసి పెట్టుకున్నాడు. ఆయన కోరిక మేరకు కుటుంబ సభ్యులు పత్రికలతోపాటు ఉమామహేష్ ఫేస్ బుక్ అకౌంట్ లో ప్రచురించగా నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

రీసైకిల్డ్ టీనేజర్ గా.. రేస్ రన్నర్ గా.. హౌస్ మేకర్ గా.. పార్టీ హోస్ట్ గా.. ఫిల్మ్ మేకర్ గా.. రేషనలిస్ట్ గా.. హ్యూమనిస్ట్ గా తన  బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినట్టు వివరించారు. అందరూ హ్యాపీగా జీవించాలని సూచించాడు.

ఇక తన మరణ వార్షికోత్సవ ప్రకటనలో తనను తాను వాహనంగా పోల్చుకుంటూ తనలోని కొన్ని భాగాలు పనిచేయడం లేదని.. రిపేర్ చేసినప్పటికీ ఫలితం లేదని పేర్కొన్నాడు. తన అవయవాలు దానం చేయాలని కోరాడు.

కాగా ఉమామహేష్ దాతృత్వం మంచి మనసుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.