Begin typing your search above and press return to search.

రీల్ కాదు రియల్.. ఆయనకు 73.. ఆమెకు 26.. ఎంచక్కా పెళ్లి చేసుకున్నారు

By:  Tupaki Desk   |   15 Oct 2021 4:35 AM GMT
రీల్ కాదు రియల్.. ఆయనకు 73.. ఆమెకు 26.. ఎంచక్కా పెళ్లి చేసుకున్నారు
X
మీరు చదివింది కరెక్టే. అచ్చుతప్పులు అస్సల్లేవు. నిజానికి వయసు తేడా ఉన్న ఇద్దరు పెళ్లి చేసుకోవటం రోటీన్ కు భిన్నమే. అందునా అతడికి 73.. ఆమెకు 26 అంటే.. అస్సలు మింగుడుపడదు. కానీ. వాస్తవం.అయితే.. ఈ తరహా పెళ్లిళ్లు ప్రాశ్చాత్య దేశాల్లో జరుగుతుంటాయి. అందుకు భిన్నంగా మన తెలుగు నేల మీద జరగటం ఒక ఎత్తు అయితే.. ఈ పెళ్లికి ఇరు కుటుంబాల వారు ఓకే చేసి.. దగ్గరుండి పెళ్లి చేయించిన తీరు మరింత ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఈ వెరైటీ పెళ్లి ఎక్కడ జరిగిందన్న వివరాల్లోకి వెళితే..

తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల్లో ఒకటి నిర్మల్ జిల్లా. అందులోని దేగాం గ్రామం ఈ వెరైటీ పెళ్లికి వేదికైంది. ముథోల్ మండలం చింతకుంట తండా గ్రామానికి చెందిన రాథోడ్ కిషన్ అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్ అయ్యాడు. ఆయనకు ప్రస్తుతం 73 ఏళ్లు. ఇద్దరు కుమార్తెలు.. ఒక కుమారుడు ఉన్నారు. అందరికి పెళ్లిళ్లుజరిగి.. ఎవరి బతుకు వారు బతుకుతున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నారు. ఇక.. కిషన్ విషయానికి వస్తే.. ఆయన సతీమణి అనారోగ్యంతో గతంలోనే మరణించింది. దీంతో ఒంటరిగా ఉంటున్నారు.

మరోవైపు జిల్లాకు చెందిన కుభీర్ మండలం రంజని తండాకు చెందిన సునీత భర్త ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. ఆమెకు ఒక బిడ్డ ఉంది. కూలీ పనులు చేసుకొని ఆమె జీవనం సాగిస్తోంది. ఇటీవల ఆమె బంధువుల ఇంట్లో ఒక శుభకార్యం జరిగింది. దీనికి సునీత వెళ్లింది. అక్కడికి కిషన్ కూడా వచ్చారు. ఎలా పరిచయం అయ్యిందో.. అయ్యింది కానీ ఆ తర్వాత వారిద్దరి మధ్య మాటలు కలవటం.. నెమ్మదిగా మనసులు కలవటం జరిగిపోయాయి.

ఇద్దరిది ఒంటరి బతుకులే కావటం..ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉండొచ్చన్న అభిప్రాయంతోపాటు వారిద్దరి మధ్య ఇష్టాయిష్టాలు కలవటంతో ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని తమ ఇళ్లల్లోని వారికి చెప్పారు. అందుకు వారి కుటుంబ సభ్యులు సైతం ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవటంతో దాజాగా వారిద్దరిపెళ్లి సాయిబాబా టెంపుల్ లో జరిగింది. ఈ పెళ్లి స్థానికంగా సంచలనంగా మారింది.