వీడు మనిషా.. మృగమా..ఇంత నీచమా..!

Sun Sep 27 2020 23:00:01 GMT+0530 (IST)

He is Man Or Ghost

వీడిని మృగానితో పోలిస్తే ఆ మృగమే ఫీల్ అవుతుందేమో. మనిషిలో మానవత్వం నశించి పోతోంది. అని చెప్పడానికి ఇంతకంటే దారుణం మరొకటి ఉండదేమో. ఓ పశువు కన్నా హీనమైన వ్యక్తి అనుమానంతో కట్టు కున్న భార్యను తెగ నరికాడు. ఆమెకు సహకరించారని మరదలుఅత్తను కూడా ముక్కలు ముక్కలుగా నరికి చంపేశాడు. ఆ దుర్మార్గుడు అంతటితో ఆగలేదు. వాళ్ళ ముగ్గరు శవాలపై అత్యాచారం చేశాడు. ఈ దారుణ సంఘటన హర్యానా రాష్ట్రంలో జరిగింది.
అసలు ఇలాంటి  క్రూరమైన పని ఇది వరకు ఎప్పుడూ విని ఉండమేమో.  మనిషిలో మానవత్వం నశించి పోతోందని గతంలో ఎన్నో సంఘటనలు జరిగాయి కానీ ఇంత నితిమాలిన పని ఎప్పుడూ జరిగింది లేదు. అసలు దీని గురించి వింటుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. పానిపట్ కట్టి కలియానాకు చెందిన నూర్ హసన్ తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్నాడు. ఆమెకు అత్త మరదలు కూడా సహకరిస్తున్నారని వారిపై కక్ష పెంచుకున్నాడు. ఆ ముగ్గురిని చంపాలని నిర్ణయించు కున్నాడు. కొద్ది రోజులుగా సమయం కోసం వేచి చూస్తున్న అతడు శనివారం తన భార్యతో పాటు అత్త మరదలిని కత్తితో నరికి హత్య చేశాడు. అనంతరం అత్యంత జుగుప్సకరంగా మూడు శవాలపై అత్యాచారం చేశాడు. అనంతరం మృతదేహాలను దుప్పట్లో చుట్టి పెట్టి కాల్చివేశాడు. ఈ దారుణ సంఘటన గురించి తెలుసుకున్న బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ దుర్మార్గుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పాశవిక సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.