Begin typing your search above and press return to search.

ఈ అమ్మాయిని చూడండి.. మీరు ఊహించలేని విషయం ఉంది

By:  Tupaki Desk   |   19 Jun 2021 4:30 AM GMT
ఈ అమ్మాయిని చూడండి.. మీరు ఊహించలేని విషయం ఉంది
X
వినేందుకు కాస్తంత విచిత్రంగా.. అర్థం చేసుకోవటానికి కాస్త సమయం తీసుకోవటం ఈ అమ్మాయి ప్రత్యేకత. ఫోటోలోని ఈ అమ్మాయిని చూసినప్పుడు ఆమెలో ఏమైనా ప్రత్యేకతను కానీ కొత్తదనం కానీ కనిపించిందా? అదేం లేదు.. ఎందుకింత హైప్ అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. ఈ భూ ప్రపంచంలో మరెవరికీ లేని ప్రత్యేకత ఈ అమ్మాయి సొంతం. ఈ అమ్మాయి ప్రపంచంలో అసలు లేదు. ఆలా అని రోబో కూడా కాదు. కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సుతో రూపొందించిన వర్చువల్ అమ్మాయి.

అంటే.. కంటికి కనిపించే ఈ అమ్మాయి భౌతిక ప్రపంచానికి ఏ మాత్రం సంబంధం లేనిది. కేవలం కంటికి కనిపిస్తుందే తప్పించి.. మరింకేమీ లేదు. ఈ క్రెడిట్ అంతా చైనా వాడిదే. చైనాకుచెందిన పలు టెక్నాలజీ సంస్థలు కలిసి భౌతిక ప్రపంచానికి సంబంధం ఒక వర్చువల్ విద్యార్థిని రూపొందించారు. అంతేకాదు.. ఆ అమ్మాయి సింఘువా వర్సిటీలో కంప్యూటర్ సైన్స్ కోర్సులో ఆడ్మిషన్ సంపాదించింది కూడా. ఈ వర్చువల్ సుందరికి హువా హైబింగ్ అనే పేరు పెట్టారు.

ఈమెను బీజింగ్ అకాడమీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సు.. జైపు ఏఐ.. షియోఐన్ సంస్థలుకలిసి రూపొందించాయి. ఏ విషయాన్ని అయినా ఇట్టే నేర్చుకునేలా ఆమెను తీర్చిదిద్దారు. ఇప్పటికే చిత్రలేఖనం నేర్చుకున్నఈ అమ్మాయి.. కోడింగ్ లోనూ నైపుణ్యం సంపాదించే ప్రయత్నం చేస్తోందట. రోబోలా కాకుండా వర్చువల్ విద్యార్థిని మనిషిలా ఇతరుల్ని పరిచయం చేసుకొని మాట్లాడుతుంది. అంతేకాదు.. అంతకు మించి అన్నట్లుగా మనిషిలా ఆలోచించటం.. వారిలా భావోద్వేగాల్ని పలికించటం ఆమె సొంతం. ఇప్పుడీ వర్చువల్ అమ్మాయి కాన్సెప్టు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. ఎంతైనా చైనావాడు.. చైనా వాడే సుమా.