పవన్ టోన్‌లో మార్పు.. గమనించారా?.. మోడీ ఎఫెక్టేనా..?

Tue Nov 29 2022 10:54:46 GMT+0530 (India Standard Time)

Have you noticed the change in Pawan's tone? Is it the Modi effect?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టోన్ మారింది. గమనించారా? ఇదీ..ఇప్పుడు రాజకీయాల్లో ఏ ఇద్దరు కలిసి నా మాట్లాడుకుంటున్న చర్చ. ఎందుకంటే.. ఆయన దూకుడులో పెద్దగా మార్పు లేకపోయినా.. మాటలో మాత్రం మార్పు కనిపించింది. ఇంతకుముందు.. అనేక సభల్లోను.. తర్వాత.. అంతర్గత సమావేశాల్లో కూడా.. పవన్ శైలి వేరేగా ఉండేది. అయితే తాజాగా అటు విజయనగరం ఇటు మంగళగిరి సభలను గమనిస్తే.. మాత్రం తేడా కనిపిస్తోంది.గతంలో టీడీపీ నేతలపై జరిగిన దాడులను పవన్ ఖండిచారు. ముఖ్యంగా చంద్రబాబు ఇంటిపై దాడిని పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని.. ప్రస్తావించి.. వైసీపీ నేతలపై విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి.

మరీ ముఖ్యంగా చంద్రబాబు సతీమణిని విమర్శించడంపై అయితే ఏకంగా పవన్ నిప్పులు చెరిగారు. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే ప్రధాని మోడీతో భేటీ అనంతరం  ఈ విష యంలో పవన్ చప్పబడ్డారు.

మోడీతో భేటీ తర్వాత.. పవన్ విజయనగరం మంగళగిరిలోని పార్టీ కార్యాలయాల్లో నిర్వహించిన సభల్లో ఎక్కడా నామమాత్రంగా కూడా టీడీపీ గురించిన ప్రస్తావన తీసుకురాలేదు. అంతేకాదు.. సందర్భం  వచ్చినప్పుడు కూడా తప్పించుకున్నారు. ప్రతిపక్షంపై అంటూ.. మాటను దాట వేశారు.

ఇక వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలకుండా చూడాలని అంటూనే.. తానే యుద్ధం చేస్తానని ప్రకటించడం ఎవరికీ అర్ధం కాని విషయంగా మారిపోయింది.

ఏతా వాతా ఎలా చూసుకున్నా పవన్ టోన్‌లో మార్పు అయితే స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. మరి ఇది మోడీ ఎఫెక్టా.. బీజేపీ ఎఫెక్టా అనేది ఆసక్తిగా మారింది. మరోవైపు పవన్ మా వైపు వచ్చేస్తాడు... ఈ సారి ఇద్దరం కలిసి జగన్‌ను గద్దె దింపేస్తాం అంటూ ప్రచారం చేసుకున్న టీడీపీ వాళ్లకు తాజా పరిణామాలు ఇప్పుడు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టుగా అనిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.