Begin typing your search above and press return to search.

హవానా సిండ్రోమ్ : అగ్రరాజ్యం లో అలజడి .. భారత్ కి మరో టెంక్షన్ !

By:  Tupaki Desk   |   24 Sep 2021 1:30 AM GMT
హవానా సిండ్రోమ్ : అగ్రరాజ్యం లో అలజడి .. భారత్ కి మరో టెంక్షన్  !
X
ఒకవైపు కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుంటే దాని వేరియంట్ గా వచ్చిన డెల్టా పెరుగుతూ వస్తోంది. మరోవైపు హవానా సిండ్రోమ్ అంటూ గత కొన్ని రోజులుగా మరో వ్యాధి అందర్నీ అయోమయంలో పడేస్తోంది. ఈ నెల ప్రారంభంలో యూఎస్ సిఐఏ డైరెక్టర్ విలియం బర్న్స్ భారత పర్యటనలోనే ఈ లక్షణాలు ఎదుర్కొంటున్నట్లు చెప్పడంతో ఈ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే హవానా సిండ్రోమ్ అంటే ఏమిటి అనే విషయం ఇప్పటికీ చాలా మందికి తెలియదు.

2016 లో మొదటగా ఈ సిండ్రోమ్ కేసులు నమోదయ్యాయి. అయితే అది క్యూబాలో కావడం గమనార్హం. వికారం, తీవ్రమైన తలనొప్పి, అలసట, మైకం, నిద్ర సమస్యలు, వినికిడి లోపం. శాశ్వతంగా మీద దెబ్బ తినడానికి కూడా ఈ సిండ్రోమ్ కారణం అవుతుందట. సుమారు 200 మంది యూఎస్ సిబ్బంది, వారి కుటుంబాలు నెలరోజులపాటు అప్పట్లో సిండ్రోమ్ లక్షణాలు ఎక్స్పీరియన్స్ చేశారు. హవానా సిండ్రోమ్ కు కారణం ఏమిటనేది ఇంకా తెలియరాలేదు.

కానీ కొంతమంది పరిశోధకుల ప్రకారం ఈ సిండ్రోమ్ అల్ట్రాసౌండ్, అల్ట్రాసోనిక్ సిగ్నల్స్, పురుగుల మందులు, ఇన్ఫెక్షన్ ఏజెంట్లు తదితర కారణాల వల్ల వ్యాపిస్తోంది. నిజానికి ఈ వ్యాధికి ఇంకా చికిత్స లేదు. ఎందుకంటే దీనికి కచ్చితమైన కారణమేంటో ఇంకా వైద్యులు కనుగొన లేకపోయారు. కానీ పేషేంట్స్ కు కలిగే వికారం, మైకం వాటికి సంబంధించి ప్రాథమిక చికిత్స మాత్రం అందుతోంది.
ఈ నెల మొదట్లో భారత్‌లో పర్యటించిన అమెరికా ఇంటెలిజన్స్ అధికారిలో ఈ సిండ్రోమ్ లక్షణాలు కనిపించినట్లు తెలుస్తోంది. దీంతో భారత్‌ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. సీఐఏ డైరెక్టర్‌ కు హవానా సిండ్రోమ్ లక్షణాలపై ప్రస్తుతం అమెరికా దర్యాప్తు జరుపుతోంది. ముఖ్యంగా అమెరికా దౌత్యవేత్తలు, ఇంటెలిజన్స్ అధికారులు మాత్రమే వాహనా సిండ్రోమ్‌ బారినపడుతున్నారు.

ఈ సిండ్రోమ్‌ వల్ల మెదడు తీవ్రంగా దెబ్బతింటోంది. కొందరు వినికిడి కోల్పోతున్నారు. గత ఐదేళ్లలో దాదాపు 200 మంది అమెరికా అధికారులు, వారి కుటుంబ సభ్యులు దీని బాధితులుగా మారినట్లు తెలుస్తోంది. వికారం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. 2016లో క్యూబా రాజధాని హవానాలో అమెరికా దౌత్య కార్యాలయాల్లో పనిచేసేవారిలో తొలిసారిగా ఈ సిండ్రోమ్‌ను గుర్తించారు. హవానాలో తొలుత గుర్తించినందున దీనికి హవానా సిండ్రోమ్ అని నామకరణం చేశారు. బాధితుల్లో ఎక్కువ మంది క్యూబా, చైనా, రష్యా, ఆస్ట్రియా, పోలాండ్‌ లోని అమెరికా దౌత్య కార్యాలయాల్లో పనిచేసేవారే ఉన్నారు. డిప్లోమాట్స్‌ తో పాటు తమ సైనికులు కూడా పెద్ద సంఖ్యలో దీని బారినపడే ప్రమాదముందని అగ్రరాజ్యం ఆందోళన చెందుతోంది.

హవానా సిండ్రోమ్ ఎందుకు? ఎలా? వస్తుందో శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కడం లేదు. ఇది సోకుతున్న వారికి మెదడు తీవ్రంగా దెబ్బతింటున్నట్లు స్కానింగ్‌లో తేలింది. భారీ ప్రమాదం జరిగితే మెదడు దెబ్బతినే స్థాయిలో హవానా సిండ్రోమ్ కారణంగా మెదడు దెబ్బతినడం పట్ల వైద్య నిపుణులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హవానా సిండ్రోమ్ వ్యవహారాన్ని నిగ్గుతేల్చేందుకు ప్రత్యేక దృష్టిసారించారు. మైక్రోవేవ్ తరంగాల సాయంతో గుర్తు తెలియని ప్రత్యర్థులు తమ సిబ్బందిపై దాడులు చేస్తున్నట్లు భావిస్తోంది.