Begin typing your search above and press return to search.

పాక్​ లో చిక్కుకున్న మహిళ .. 18 ఏళ్ల తర్వాత మాతృభూమికి ..!

By:  Tupaki Desk   |   27 Jan 2021 8:40 AM GMT
పాక్​ లో చిక్కుకున్న మహిళ .. 18 ఏళ్ల తర్వాత మాతృభూమికి ..!
X
ఎప్పుడో 18 ఏళ్ల క్రితం భర్త తరపు బంధువులను చూసేందుకు ఓ మహిళ పాకిస్థాన్​కు వెళ్లింది. అయితే అక్కడికి వెళ్లాక ఆమె పాస్​పోర్ట్​ను పోగొట్టుకున్నది. దీంతో పాకిస్థాన్​ పోలీసులు అమెను అరెస్ట్​చేశారు. అక్కడి చట్టాల ప్రకారం ఆమెకు శిక్ష విధించారు. దాదాపు 18 ఏళ్లపాటు ఆమె పాకిస్థాన్​ జైలులో మగ్గింది. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా ఎన్నోవిధాలా ఆమె ఆచూకీ కోసం ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. చివరకు ఇన్నేళ్లకు ఆమె మాతృభూమికి చేరుకొన్నది.

పరాయి దేశంలో నరకయాతన అనుభవించానని.. సొంత దేశానికి రావడంతో స్వర్గంలో అడుగుపెట్టినట్టు ఉందని ఆమె పేర్కొన్నారు. తాను జీవితంలో మళ్లీ సొంతదేశానికి వెళ్తాను అని అనుకోలేదని ఆమె పేర్కొన్నారు. అయితే దాదాపు 65 ఏళ్ల వయసులో ఆమె మాతృభూమిలో అడుగుపెట్టడం గమనార్హం. ఔరంగ‌బాద్‌కు చెందిన హ‌సీనా బేగం (65).. 18 ఏళ్ల క్రితం త‌న భ‌ర్త బంధువులను చూసేందుకు పాకిస్తాన్ వెళ్లింది. అయితే లాహోర్​లో ఆమె పాస్ పోర్ట్​ పోగొట్టుకున్నది.

ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్​ చేశారు. అక్కడి కోర్టులు జైలు శిక్ష విధించాయి. అయితే హసీనా కుటుంబసభ్యులు ఔరంగాబాద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఔరంగాబాద్​ పోలీసులు ఎన్నోసార్లు పాకిస్థాన్​కు లేఖలు రాశాయి. చివరకు అక్కడి అధికారులు హసీనా జైళ్లో ఉన్నట్టు పేర్కొన్నారు. మనదేశంలోని కొందరు అధికారుల దౌత్యంతో హసీనా ఇండియాకు చేరుకోగలిగింది.