Begin typing your search above and press return to search.

మొన్న మామ‌..నేడు అల్లుడు..కేంద్ర ప్యాకేజీపై మంత్రి హ‌రీశ్‌ రావు కీల‌క వ్యాఖ్య‌లు!

By:  Tupaki Desk   |   27 May 2020 2:30 PM GMT
మొన్న మామ‌..నేడు అల్లుడు..కేంద్ర ప్యాకేజీపై మంత్రి హ‌రీశ్‌ రావు కీల‌క వ్యాఖ్య‌లు!
X
లాక్‌ డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ ప్యాకేజీపై తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రం ప్ర‌క‌టించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీతో పేదలు - నష్టపోయిన రంగాలకు ఏమాత్రం న్యాయం జరగలేదని పేర్కొన్నారు. నేరుగా ఎవరూ కూడా లాభపడిన‌ దాఖలాలు లేవని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. అనేక రంగాలకు అసలు ఎలాంటి ప్రయోజనం జరగలేదని ఆరోపించారు.

అయితే కేంద్ర ప్యాకేజీపై గ‌తంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ఘాటుగా స్పందించగా ఇప్పుడు అత‌డి అల్లుడు - మంత్రి హ‌రీశ్ రావు స్పందించి పెద‌వి విరిచారు. సిద్ధిపేట జిల్లాలో బుధ‌వారం ఏర్పాటు చేసిన ఓ స‌మావేశంలో మంత్రి హరీశ్‌ రావు కేంద్ర ప్యాకేజీపై స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఆటో కార్మికులకు ఉపాధి లేదని.. పర్యాటకం - ఆటోమొబైల్‌ - ఏవియేషన్‌ రంగాలు బాగా దెబ్బతిన్నాయని - హోటళ్ల రంగం కుదేలైంద‌ని వివ‌రించారు. కార్మికులు రోడ్డున పడ్డారన్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పూర్తిస్థాయిలో దెబ్బతిన్న రంగాలను కేంద్రం ఆదుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. బ్యాంకు అనుసంధానంతో అప్పులు రావడం చాలా కష్టమని కేంద్రం నేరుగా సహాయం అందించాలని ఈ సంద‌ర్భంగా కోరారు. లేదంటే రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందించేలా నిధులివ్వాలని విజ్ఞ‌ప్తి చేశారు. లాక్‌ డౌన్‌ సమయంలో ఎన్‌.జీ.ఓలతో పాటు చాలా మంది స్వచ్ఛందంగా ప్రజలకు సేవలందించడం సంతోషకరమని కొనియాడారు.