Begin typing your search above and press return to search.

టీడీపీ - జ‌న‌సేన పొత్తుల‌ రాజ‌కీయంలో మంట‌లు మొద‌ల‌య్యాయ్‌...!

By:  Tupaki Desk   |   24 Jan 2023 9:04 AM GMT
టీడీపీ - జ‌న‌సేన పొత్తుల‌ రాజ‌కీయంలో మంట‌లు మొద‌ల‌య్యాయ్‌...!
X
ఒక‌వైపు టీడీపీ-జ‌న‌సేన పొత్తుల విష‌యంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్ప‌టికీ త‌ర్జ‌న బ‌ర్జ‌న ప‌డుతూనే ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇంకా రోడ్ మ్యాప్ ఇవ్వ‌లేద‌ని అనుకుంటున్నారో.. లేక ఇంకా ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఉంద‌ని భావిస్తున్నారో.. తెలియ‌దు కానీ ఇప్ప‌టికీ ఈ పొత్తుల‌పై క్లారిటీలేని క‌థ‌నాన్నే ముందుకు న‌డిపిస్తున్నారు. పొత్తులు ఉంటాయ‌ని చెబుతున్నారు కానీ, దీనికి ఒక ప్రాతిప‌దిక అనేది క్లారిటీ లేదు.

అయితే..ఇంత‌లోనే కాపు సేన నాయ‌కుడు, సీనియ‌ర్ వృద్ధ‌నేత హ‌రిరామ‌జోగ‌య్య‌.. ఈ పొత్తుల‌పై సంచ‌ల న కామెంట్లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాపు నాయ‌కుడు ముఖ్య‌మంత్రి కావాల‌ని అన్నారు. అంతేకాదు.. జ‌న‌సేన‌-టీడీపీ పొత్తు పెట్టుకుంటే.. ఖ‌చ్చితంగా ప‌వ‌న్‌కే ముఖ్య‌మంత్రి పీఠం ఇవ్వాల‌ని.. అప్పుడు మాత్ర మే కాపుల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని అన్నారు. కాపుల‌ను ర‌క్షించాల‌న్నా.. వారికి సంక్షేమం జ‌ర‌గాల‌న్నా .. ప‌వ‌న్ ముఖ్య‌మంత్రి కావాల్సి ఉంద‌న్నారు.

అయితే, ఇప్పుడు ఇదే వ్యాఖ్య‌లు పొత్తుల మ‌ధ్య మంట‌లు రేపేవిగా ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కు లు. ఎందుకంటే.. ఇప్ప‌టికే కాపులు ప‌వ‌న్‌ను ముఖ్య‌మంత్రిగా చూడాల‌ని అనుకుంటున్న మాట నిజ‌మే. అయితే.. టీడీపీతొ పొత్తు పెట్టుకుంటే..చంద్ర‌బాబు చేసిన శ‌ప‌థం ఇంపార్టెంట్ . సో.. ఆయ‌న ముఖ్య‌మం త్రి కావాల్సి ఉంది. ఈ విష‌యాన్ని దృష్టిలో పెట్టుకునే ప‌వ‌న్ కొన్నాళ్లుగా .. ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

దీంతో కాపులు కూడా మాన‌సికంగా ప‌వ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంద‌నే భ‌వ‌న వైపు అడుగులు వేస్తున్నారు. ఏదో ర‌కంగా అధికారంలో ప‌వ‌న్ ఉంటే చాల‌ని కూడా లెక్క‌లు వేసుకుంటున్నా రు. అంటే ఒక ర‌కంగా..ప‌వ‌న్‌ను ముఖ్య‌మంత్రిగా చూడాల‌ని అనుకునేవారి మ‌న‌సు మారుతున్న స‌మ‌యంలో అనూహ్యంగా జోగ‌య్య చేసిన కామెంట్లు .. ఆయ‌న పెట్టి కండిష‌న్లు .. మ‌ళ్లీ మంట‌లు రేపుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇది కాపు స‌మాజం ఓట్లను వైసీపీకి ప‌డేలా చేసినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.