Begin typing your search above and press return to search.

హాస్టల్ లో 317 మంది బాలికల కిడ్నాప్

By:  Tupaki Desk   |   27 Feb 2021 3:18 AM GMT
హాస్టల్ లో 317 మంది బాలికల కిడ్నాప్
X
ఆఫ్రికాలోని ఉత్తర నైజీరియాలో దారుణం జరిగింది. తుపాకులు చేతబట్టి వచ్చిన గుర్తు తెలియని దుండగులు బాలికల వసతి గృహం పై దాడి చేసి 317 మంది పాఠశాల విద్యార్థులను కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ కు గురైన వారంతా 10 నుంచి 13 ఏళ్ల వయసు ఉన్నవారే. శుక్రవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఇటీవల నైజీరియాలోని కంగారాలో ఉపాధ్యాయులు సహా 42 మంది విద్యార్థినులు కిడ్నాప్ కాగా వారి జాడ ఇప్పటికీ తెలీదు. ఇదిలా ఉండగానే 317 మంది బాలికలు కిడ్నాప్ కావడం సంచలనం సృష్టించింది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నైజీరియాలో జాంగేబ్లోని ప్రభుత్వ సెకండరీ పాఠశాల దగ్గరకు వచ్చిన గుర్తు తెలియని దుండగులు పాఠశాలపై దాడి చేశారు. స్కూలుకు దగ్గరలో ఉన్న సైనిక్ సైనిక శిబిరం, చెక్ పోస్టులపై కూడా దాడి చేసి పాఠశాలలోకి ప్రవేశించారు. 317 మంది బాలికలను అపహరించారు. వారం కిందట కంగారాలోని పాఠశాలపై దాడి చేసిన సాయుధ దుండగులు ఉపాధ్యాయులు 42 మందిని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత వారిని అడవిలోకి లాక్కెళ్లారు. వారి జాడ తెలియక ముందే మరో సంఘటన జరిగింది.

డబ్బుకోసం జైల్లో ఉన్న తమ సభ్యుల విడుదల కోసం బందిపోటు ముఠాలు సరస్సు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నట్లు జామ్ ఫరా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. బాలికలను సురక్షితంగా విడిపించేందుకు నైజీరియా సైన్యం, పోలీసులు రంగంలోకి దిగి చర్యలు చేపట్టింది. ఏకంగా పాఠశాల హాస్టల్ లోకి ప్రవేశించి 317 మంది బాలికలను కిడ్నాప్ చేయడం నైజీరియాలో కలకలం సృష్టించింది.