చికాగోలో ఇద్దరు తెలుగు విద్యార్థులపై కాల్పులు

Mon Jan 23 2023 18:25:53 GMT+0530 (India Standard Time)

Gun Violence Scare Telugu Students In US Sustain Injuries

చికాగోలో ఇద్దరు తెలుగు విద్యార్థులపై నల్ల జాతీయులు కాల్పులకు తెగబడ్డారు.చికాగో సౌత్ సైడ్‌లో జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.  ప్రిన్స్‌టన్ పార్క్‌లో ఆదివారం రాత్రి జరిగిన సాయుధ దోపిడీలో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. ముదురు రంగు వాహనంలో వచ్చిన దోపిడీ దొంగలు సమీపంలోకి వచ్చి తుపాకీతో ఇద్దరు తెలుగు విద్యార్థులను డబ్బులు ఇతర వస్తువులు  డిమాండ్ చేశారని చికాగో పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరు తెలుగు విద్యార్థులపై కాల్పులు జరిపారు.. యువకుడి ఛాతీలోకి బుల్టెట్ దూసుకుపోగా.. అతడి పరిస్థితి విషమంగా ఉందని యూనివర్శిటీ ఆఫ్ చికాగో మెడికల్ సెంటర్‌కు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. మరో యువకుడి చంకలోకి తుటా దూసుకెళ్లింది.  ఇతడిని ఓక్ లాన్‌లోని క్రైస్ట్ మెడికల్ సెంటర్‌కు తీసుకువెళ్లాడు. అక్కడ కూడా అతను పరిస్థితి విషమంగా ఉన్నాడు.

ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు మరియు వారి వైద్య పరిస్థితిపై త్వరలో అప్‌డేట్ వెలువడనుంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కాల్పుల్లో గాయపడ్డ ఒక విద్యార్థిని తెలంగాణకు చెందిన కొప్పాల సాయిచరణ్ గా గుర్తించాడు. ఇతడు గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్నాడు.

హైదరాబాద్ బీహెచ్ఈఎల్ లోని ఐజీ కాలనీలో సాయిచరణ్ తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. చికాగో నుంచి సాయి ఫ్రెండ్స్ ఇక్కడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.