Begin typing your search above and press return to search.

కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.. వరుస ఘటనలతో భయాందోళనలు..!

By:  Tupaki Desk   |   24 Jan 2023 11:42 AM GMT
కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.. వరుస ఘటనలతో భయాందోళనలు..!
X
అమెరికాలో గన్ కల్చర్ విచ్చలవిడిగా పెరిగిపోతోంది. తుపాకీల నియంత్రణను ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న ఎక్కడో ఒక చోట కాల్పుల నిత్యం కాల్పుల మోత మోగుతుండటం శోచనీయంగా మారింది. గతేడాది అమెరికా వ్యాప్తంగా గన్ కల్చర్ కారణంగా 647 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కో షూటర్ చేతిలో సగటున నలుగురు ప్రాణాలు కోల్పోవడమో లేదా గాయపడటమో జరిగిందని అధికారిక లెక్కలు చెబుతున్నారు.

అమెరికాలో మొత్తంగా సుమారు 44వేల మంది తుపాకీలతో గాయాలతో ప్రాణాలను కోల్పోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చారు. వీరిలో ఎక్కువ శాతం తుపాకీలతో షూట్ చేసుకొని ఆత్మహత్య చేసుకున్న వారే ఉండటం గమనార్హం. ఇక 2023 లో గన్ కల్చర్ మరింత పెరిగి పోయినట్లు కన్పిస్తోంది. గత 23 రోజుల్లో అమెరికాలో 36 తుపాకీ పేలుడు ఘటనలు జరిగాయి. సగటున రోజుకు ఒకటి కంటే ఎక్కువ ఘటనలు వెలుగు చూస్తుండటం అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది.

ఈ క్రమంలోనే గత మూడ్రోజుల్లో తుపాకీ మోతల కారణంగా 20 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెలెస్ కౌంటి ప్రాంతంలోని మాంటెరీ పార్క్ లో శనివారం రాత్రి చైనీయులు లూనార్ నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటుండగా ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరుకోగా దుండగుడు సైతం ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఘటన జరిగిన 48 గంటల్లో ఉత్తర కాలిఫోర్నియాలో హాఫ్ మూన్ బే ప్రాంతంలో ఇలాంటిదే వెలుగుచూసింది. హాఫ్ మూన్ బేలోని వ్యవసాయ క్షేత్రాల్లో రెండు చోట్ల దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ సంఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కాలిఫోర్నియా గవర్నర్ గెలివన్ న్యూసమ్ ‘‘విషాదం వెనుక విషాదం’’ అంటూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఐయోవా నగరంలోని డెస్ మెయిన్ ప్రాంతంలోని ఓ ఎడ్యుకేషనల్ మెంటార్ షిప్ ప్రొగ్రామ్ లోనూ ఓ అగంతకుడు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా ముగ్గురు గాయపడ్డారు. అలాగే షికాగోలో తెలుగు విద్యార్థులపై నల్లజాతీయుల జరిగిన కాల్పుల్లో హైదరాబాద్ కు చెందిన నందపు దేవ్ శిష్ మృతిచెందాడు. ఈ ఘటనలో కొప్పాల సాయిచరణ్ అనే యువకుడు గాయపడ్డారు.

తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు షాపింగ్ కు వెళ్లి వస్తుండగా నల్లజాతీయులు కాల్పులకు పాల్పడి దోపీడికి యత్నించినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా అమెరికా గన్ కల్చర్ కు ప్రభుత్వం అడ్డుకట్ట వేయలేక పోతుందని ఈ ఘటనలు చూస్తే అర్థమవుతోంది. దీంతో అమెరికాలో గన్ కల్చర్ కు అడ్డుకట్ట పడేది ఎప్పుడనేది ప్రశ్నార్థకంగా మారడంతో అమెరికన్లు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.