Begin typing your search above and press return to search.

గుజరాత్‌ డ్రగ్స్ రాకెట్ కేసు: రంగంలోకి ఎన్ఐఏ!

By:  Tupaki Desk   |   25 Sep 2021 3:30 PM GMT
గుజరాత్‌ డ్రగ్స్ రాకెట్ కేసు: రంగంలోకి ఎన్ఐఏ!
X
గుజరాత్‌ లో పట్టుబడ్డ హెరాయిన్‌ కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. హెరాయిన్‌ కేసులో తెరపైకి ఏపీలోని ద్వారపూడి ప్రాంతం తెరపైకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా నిఘావర్గాలు అప్రమత్తమయ్యాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా మాచవరపు సుధాకర్‌ ను అనుమానిస్తున్న పోలీసులు, అత్తగారి ఇంటి అడ్రస్‌ తో సుధాకర్‌ జీఎస్టీ లైసెన్స్‌ పొందినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే డ్రగ్‌ మాఫియాతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికే సుధాకర్‌ చెన్నై, కోల్‌కతా, వైజాగ్‌లో ప్రైవేట్‌ జాబ్స్‌ చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం తల్లి, సోదరుడితో కలిసి ద్వారపూడిలో నివాసం ఉంటున్న సుధాకర్‌, విశాఖలో జీవిస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

గుజరాత్ డ్రగ్స్‌ రాకెట్ కేసులో ఎన్‌ ఐ ఏ రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదం కోణంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దృష్టి సారించింది. డ్రగ్స్ అమ్మకం ద్వారా వచ్చే డబ్బుతో ఉగ్రవాదులు మారణాయుధాలు కొనుగోలు చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. తాలిబన్ల చేతిలోకి వెళ్లిన తర్వాత ఆఫ్ఘన్ నుంచి వచ్చే సరుకుపై గట్టి నిఘా ఏర్పాటు చేశారు. సరుకు రవాణా ముసుగులో ఉగ్రవాదులు మాదకద్రవ్యాలు రవాణా చేస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌ఐఏ రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

డ్రగ్స్ రాకెట్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) రంగంలోకి దిగనుంది. ఉగ్రవాదం కోణంలో ఎన్‌ఐఏ దృష్టి సారించనుంది. డ్రగ్స్ అమ్మకం ద్వారా వచ్చే డబ్బుతో ఉగ్రవాదులు మారణాయుధాలు కొనుగోలు చేస్తున్న కోణంలో విచారణ జరపనుంది. తాలిబన్ల చేతిలోకి వెళ్లిన తర్వాత అఫ్ఘాన్ నుంచి వచ్చే సరుకుపై గట్టి నిఘా ఏర్పాటు చేయనుంది. సరకు రవాణా ముసుగులో ఉగ్రవాదులు మాదకద్రవ్యాలు రవాణా చేస్తున్నారు. ఇప్పటికే దేశంలోని హెరాయన్‌ అక్రమ దిగుమతి కేసులో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌ ఎనిమిది మందిని అరెస్ట్‌ చేసిన చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. అఫ్గానిస్తాన్‌ లోని కాందహార్‌ నుంచి ఇరాన్‌లోని ముంద్రా పోర్టుకు వచ్చిన రెండు కంటెయినర్లలో 2,998 కేజీల హెరాయిన్‌ను ఈ నెల 17, 19 తేదీల్లో స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.