కొవిడ్ మరణ ధ్రువీకరణకు మార్గదర్శకాలివే..

Mon Sep 13 2021 15:52:55 GMT+0530 (IST)

Guidelines for Covid Death Certification

కొవిడ్ మరణాలపై ధ్రువపత్రాలను సమర్పించడంలో సుప్రీం కోర్టుల వాదనలు జరుగుతున్న విషయం తెలిసింది. తాజాగా కేంద్రం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ను అందించింది. అందులో కరోనా నిర్దారణ అయిన తరువాత.. ఆ తరువాత మరణం సంభవిస్తే కొవిడ్ -19 సర్టిఫికెట్ ఇస్తామని తెలిపింది. అయితే మార్గదర్శకాల రూపకల్పనలో ఆలస్యం చేయడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనెల 3నే మార్గదర్శకాలతో అఫిడవిట్ ను సమర్పిస్తామని తెలిపి ఆలస్యం చేసింది. ఇందులో భాగంగా కేంద్రం నిర్దారించిన మార్గదర్శకాలతోనే కొవిడ్ మరణ ధ్రువీకరణ పత్రాన్ని మంజూరు చేయనున్నారు.కరోనా ఫస్ట్ సెకండ్ వేవ్ లతో దాదాపు రెండు లక్షలకు చేరువలో మరణాలు సంభవించాయి. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్లోనే అధికమరణాలు జరిగాయి. సెకండ్ వేవ్ పై అంచనాలు వేయకపోవడంతో ప్రభుత్వాలు సరైన వైద్య సదుపాయాలు కల్పించలేదు. దీంతో కేసులు విపరీతంగా పెరిగాయి. అంతే స్థాయిలో మరణాలు కూడా సంభవించాయి. అయితే కొన్ని ప్రదేశాల్లో కరోనాతో మరణించినా సాధారణ మరణంగా చెప్పారు. మరికొన్ని చోట్ల కరోనా మృతులకు ధ్రువపత్రాలు జారీ చేయలేదు. దీంతో కొవిడ్ మరణాలు దాస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి. ఇందులో భాగంగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడంతో విచారణను స్వీకరించింది.

తాజాగా ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) రూపొందించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ తో పాటు కోర్టులో సమర్పించింది. ఆర్టీపీసీఆర్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా కొవిడ్ నిర్దారణ అయితే కొవిడ్ -19 కేసుగా పరిగణిస్తారు. అయితే కొవిడ్ బాధితుడు ఆత్మహత్య లేదా హత్య ప్రమాద మృతి జరిగితే కొవిడ్ మృతిగా భావించరు. కరోనాతో మృతి చెందిన వారిలో 95 శాతం 25 రోజుల్లోపే మరణించారు. అయినా 30 రోజుల్లోపు మరణిస్తే కొవిడ్ మరణంగానే పరిగణిస్తారు.

కరోనాతో మృతి చెందిన వారి ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా రాష్ట్రస్థాయిలో కమిటీలు ఏర్పరచాలి. జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ జిల్లా వైద్యాధికారి అదనపు ద్యాధికారి అధ్యక్షత వహిస్తారు. కొవిడ్ తో మరణించినట్లుగా మృతుడి తరుపున బంధువులు లేదా కుటుంబ సభ్యులు వినతి సమర్పించాలి. ఫిర్యాదు చేసిన తరువాత వాస్తవాలన్నీ పరిశీలించిన తరువాతే తగిన ధ్రువపత్రం ఇవ్వాలని ఐసీఎంఆర్ సూచించింది.

ఇక కరోనా కేసులు  డేబైడే అన్నట్లు పెరుగుతున్నాయి. ఒకరోజు పెరుగుతూ మరో రోజు తగ్గుతున్నాయి. వైద్య నిపుణులు అక్టోబర్లో థర్డ్ వేవ్ ముప్పు ఉందన్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వైద్య సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. అయితే  కేరళ లాంటి రాష్ట్రాలో మాత్రం 20 వేలకు ఎక్కువగానే రోజూవారీ కేసులు నమోదవుతున్నాయి. ఇక ఏపీలోనూ కేసుల తగ్గుదల కనిపించడం లేదు. ముఖ్యంగా పాఠశాలలో కేసులు నమోదు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కేసలు సంఖ్య తక్కువగా ఉన్నా కొన్ని జిల్లాల్లో మాత్రం తగ్గుదల మాత్రం కనిపించడం లేదు.

కేసులు పెరిగినా.. లేకున్నా.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్ కు అందరూ సహకరించాలని కోరుతున్నారు. సెకండ్ వేవ్ లో వ్యాక్సినేషన్ లేకపోవడం వల్లే కేసులు పెరిగాయని ఇప్పడు టీకా వేసుకునేందుకు ముందుకు రావడంతో కేసులు పరగడం లేదని తెలంగాణ వైద్య అధికారులు పేర్కొంటున్నారు. అయితే కేసుల గురించి ఆలోచించకుండా మాస్క్ లు ధరిస్తూ భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని అధికారులు వైద్యులు సూచిస్తున్నారు. కొన్ని చోట్ల జ్వరాలు వస్తున్నా అవి వాతావరణ మార్పులతోనేనని అంటున్నారు. అయితే అనుమానం ఉన్న ప్రతి ఒక్కరు కరోనా పరీక్ష చేయించుకోవాలంటున్నారు.