Begin typing your search above and press return to search.

పెట్రోల్ ధర తగ్గాలి అనుకుంటే .. మోదీకి ఓటు వేయకండి !

By:  Tupaki Desk   |   30 Oct 2020 2:10 PM GMT
పెట్రోల్ ధర తగ్గాలి అనుకుంటే .. మోదీకి ఓటు వేయకండి !
X
బ్రతుకు బండి నడవాలంటే పచ్చ నోటు కావాలి , వాహనాలు నడవాలంటే పెట్రోల్ , డీజల్ కావాలి. కానీ, గత కొన్నిరోజులుగా పెట్రోల్ , డీజల్ ధరలు రోజురోజుకి ఆకాశాన్ని తాకేలా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ కూడా పెట్రోల్, డీజల్ ధరలు తారుమారు అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు. అయితే , కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్రోల్ , డీజల్ ధరలు కొంచెం కొంచెం పెరుగుతూ వస్తున్నాయి. ఒకప్పుడు పెట్రోల్ , డీజల్ ధరలు 40 రూపాయలు లోపల ఉండేవి. కానీ, ఆ తర్వాత పెరుగుతూ పెరుగుతూ పెట్రోల్ , డీజల్ ధరలు 90 రూపాయలపైకి చేరాయి.

ఇదిలా ఉంటే , తాజాగా ఓ పోస్ట్ సోషల్ మీడియా ను షేక్ చేస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ నేత గూడూరు నారాయణరెడ్డి పెట్రోల్ రేటు పెరుగుదల పై చేసిన ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. ముంబైలో ఓ పెట్రోల్ బంక్ యాజమాన్యం తమ రసీదులపై మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. పెట్రోల్ ధరలు తగ్గాలి అనుకుంటే మోడీకి ఓటు వేయకండి ఆ రసీదులో పొందుపరిచారు. ముంబైలో లీటర్ పెట్రోల్ రేటు... రూపాయలు 87.88 గా ఉంది. హైదరాబాద్‌‌లో శుక్రవారం లీటరు పెట్రోల్ ధర రూ.84.25 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర కూడా రూ.76.84 వద్ద నిలకడగా కొనసాగుతోంది.

అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర రూ.87.16 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్‌ ధర రూ.79.34 వద్ద నిలకడగా ఉంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.86.73 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర రూ.78.93 వద్ద నిలకడగా కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధర స్థిరంగానే ఉంది. రూ.81.06 వద్ద నిలకడగా కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.70.46 వద్ద స్థిరంగా ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.87.74 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర రూ.76.86 వద్ద నిలకడగా కొనసాగుతోంది. అటు పెట్రోల్ డీజిల్ రేటు పెరుగుదల పై సామాన్యుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది.