Begin typing your search above and press return to search.

వైరస్ తో వరుడు మృతి ..95 మంది బంధువులకి పాజిటివ్ !

By:  Tupaki Desk   |   30 Jun 2020 6:30 AM GMT
వైరస్ తో వరుడు మృతి ..95 మంది బంధువులకి పాజిటివ్ !
X
దేశంలో ఈ వైరస్ మహమ్మారి రోజు రోజుకి మరింతగా విస్తరిస్తున్నా కూడా ప్రజల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. శానిటైజ్ చేసుకోవాలి , మాస్క్ ధరించాలి , భౌతికదురం పాటించాలి అని ఎంతగా చెప్తున్నప్పటికీ వినిపించుకోవడంలేదు. అలాగే వివాహాది కార్యక్రమాలని 50 మందితో మాత్రమే చేసుకోవాలని చెప్తున్నప్పటికీ ..ఇష్టాను సారంగా వందలాది మందితో వివాహ వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే పెళ్లి అయిన రెండు రోజులకే వరుడు మహమ్మారి వైరస్ ‌తో మరణించిన విషాద ఘటన బీహార్ రాష్ట్రంలోని పాలిగంజ్ పట్టణ సమీపంలోని ఓ గ్రామంలో వెలుగుచూసింది. బీహార్ రాష్ట్రం లోని దీహపాలి కి గ్రామానికి చెందిన 30 ఏళ్ల వరుడు గురు గ్రామ్ లో సాఫ్ట్ ‌వేర్ ఇంజినీరు గా పని చేసేవాడు. యువకుడు పెళ్లి చేసుకునేందుకు మే 12వతేదీన తన స్వగ్రామమైన దీహపాలికి వచ్చాడు.

అయితే , అప్పటికే ఆ యువకుడికి వైరస్ సోకింది. అయినా అతను పాలిగంజ్ సమీపంలోని ఓ గ్రామంలో జూన్ 15 వతేదీన ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న రెండు రోజులకే వరుడి ఆరోగ్య క్షీణించడంతో అతన్ని పట్నాలోని ఎయిమ్స్ కు తీసుకువెళుతుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. వరుడి బంధువులు మహమ్మారి పరీక్ష చేయించకుండానే అతని మృతదేహాన్ని దహనం చేశారు. అలాగే , వివాహానికి 50 మంది అతిథులను మాత్రమే అనుమతించాలని, వేడుకలో సామాజిక దూరం పాటించాలనే నియమాలను ఉల్లంఘించారు.

అనుమానం ఉండటంతో పెళ్లికి వచ్చిన అతిథులకు వైరస్ నిర్దారణ పరీక్షలు చేయగా వారిలో 95 మందికి వైరస్ పాజిటివ్ అని తేలింది. కాగా వధువుకు వైరస్ పరీక్ష చేయగా నెగిటివ్ అని వచ్చింది. ఈ పెళ్లి వల్లనే అత్యధికంగా 95 మందికి మహమ్మారి వ్యాపించిందని తేలడంతో జిల్లా అధికారులు అప్రమత్తమై వారందరినీ క్వారంటైన్ కు తరలించారు.