Begin typing your search above and press return to search.

రెండు చేతులతో బౌలింగ్ .. ఎలా సాధ్యమంటే?

By:  Tupaki Desk   |   19 Nov 2019 12:29 PM GMT
రెండు చేతులతో బౌలింగ్ .. ఎలా సాధ్యమంటే?
X
క్రికెట్ ప్రపంచంలో ఒక మతంలా తయారైంది. ఏ దేశంలో అయినా కూడా క్రికెట్ గురించి చర్చ నడవాల్సిందే...పిల్లలు బ్యాట్ పట్టి గల్లీ క్రికెట్ ఆడాల్సిందే. క్రికెట్ కి అభిమానులు లేని దేశం అంటూ ఏది లేదు అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక క్రికెట్ లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆడతారు. ఒకరికి బ్యాటింగ్ అంటే ఇష్టం ఉంటె ..మరొకరి బౌలింగ్ అంటే ఇష్టం ..ఇంకొకరికి కీపింగ్ అంటే ఇష్టం ... ఇలా ఎవరికీ నచ్చిన వారు ఆటని ఆస్వాదిస్తుంటారు. ఇక క్రికెట్ ప్రపంచంలో బ్యాట్ తో పరుగుల వరద పారించే స్టార్ బ్యాట్ మెన్స్ తో పాటుగా ... తమ బంతులతో నిప్పులు చెరిగే బౌలర్లు కూడా ఎంతో మంది ఉన్నారు.

క్రికెట్‌ లో రెండు చేతులతో బౌలింగ్‌ చేయడం చాలా అరుదు. రెండు చేతులతో బౌలింగ్‌ చేయడం అనేది చాలా కష్టం. ఎంతో శ్రమిస్తేకానీ ఇలా బౌలింగ్‌ చేయలేదు. రెండు చేతులతో బౌలింగ్ వేయగల సత్తా ఉన్నవారు చాలా తక్కువగా ఉంటారు. ఇలా రెండు చేతులతో శ్రీలంక స్పిన్నర్‌ కామిందు మెండిస్‌ బౌలింగ్‌ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. తాజాగా మరో బౌలర్ రెండు చేతులతో బౌలింగ్ చేసి అందరిని ఆకర్షిస్తున్నాడు.

తాజాగా దక్షిణాఫ్రికా బౌలర్ గ్రెగొరీ మహలోక్వానా ..తన రెండు చేతులతో బౌలింగ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సౌతాఫ్రికాలో జరుగుతున్న ఎమ్‌ జాన్సీ టీ20 సూపర్‌ లీగ్‌లో గ్రెగొరీ రెండు చేతులతో బౌలింగ్‌ చేయడమే కాకుండా వికెట్లు కూడా సాధించాడు. కేప్‌ టౌన్‌ బ్లిట్జ్‌ తరఫున ఆడుతున్న గ్రెగొరీ.. ఆదివారం డర్బన్‌ హీట్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు సాధించాడు. తొలుత కుడి చేతి బౌలింగ్‌ చేసి ఓపెనర్‌ సారే ఎర్వీని ఔట్‌ చేసిన గ్రెగొరీ..ఆపై ఎడమ చేతితో బౌలింగ్‌ చేసి డానే విలాస్‌ ను బోల్తా కొట్టించాడు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఒక్క చేత్తోనే బౌలింగ్ సరిగ్గా చేయలేకపోతున్న ఈ రోజుల్లో రెండు చేతులతో బౌలింగ్ చేయడం అంటే మాములు విషయం కాదు.