గ్రేటర్ పోరు... కాంగ్రెస్ నేతకి హైకోర్టులో ఊరట

Sun Nov 22 2020 23:02:32 GMT+0530 (IST)

Greater fight ... Congress leader sits in High Court

గ్రేటర్ ఎన్నికల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ తిరస్కరణకు గురైన కాంగ్రెస్ నేత కూన శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల నామినేషన్ తిరస్కరణపై తాజాగా హైకోర్టు స్టే ఇచ్చింది. గాజులరామారం డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన శ్రీనివాస్ గౌడ్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. కాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని ఎంపీ రేవంత్‌రెడ్డి ఎస్‌ఈసీకి అందజేశారు. కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీకి రేవంత్ విజ్ణప్తి చేశారు. నామినేషన్ తిరస్కరణపై నిన్న గాజుల రామారం వద్ద కాంగ్రెస్ ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీనివాస్ గౌడ్ స్క్రూటినిలో కుట్రపూరితంగా డిస్‌క్వాలిఫై చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేయడంతో శనివారం రిటర్నింగ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీఆర్‌ఎస్ ఒత్తిళ్లకు అధికారులు లొంగుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.