Begin typing your search above and press return to search.

ఇకపై రోజుకి 8 గంటలు కాదు 9 గంటలు...?

By:  Tupaki Desk   |   19 Nov 2019 7:04 AM GMT
ఇకపై రోజుకి 8 గంటలు కాదు 9 గంటలు...?
X
సాధారణంగా మన దేశంలో ప్రస్తుతం రోజుకి 8 గంటలు మాత్రమే పనిచేస్తున్నారు. ఆ సమయాన్నే ఒక వర్కింగ్ డే గా లెక్కేస్తున్నారు. ఆలా వారంలో ఆరు రోజులు ..రోజుకి 8 గంటల చొప్పున పనిచేస్తున్నారు. కానీ , కేంద్రంలో అధికారంలో ఉండే మోడీ సర్కార్ ఈ వర్కింగ్ హావర్స్ పై ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది అని సమాచారం. ఇప్పటికే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న బీజేపీ ప్రభుత్వం ... దీనిపై కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోంది. అదేమిటి అంటే ప్రస్తుతం ఉన్న వర్కింగ్ సమయాన్ని పెంచనున్నారట.

ఉద్యోగులకు లేదా కార్మికులకు కనీస వేతనం, దేశవ్యాప్తంగా ఒకే రోజు శాలరీ క్రెడిట్ అంశాలతో పాటు వర్కింగ్ సమయాన్ని కూడా పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. వేతన కోడ్ 2019 అమలులో భాగంగా కనీస వేతనాలు, కరువు భత్యం, పని గంటలు వంటి కార్మిక హక్కులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాలు సేకరిస్తోంది. కనీస వేతనాలు ఖరారుకు ఆరు ప్రమాణాలను నిర్ణయించింది. ఈ మేరకు కార్మిక శాఖ వివిధ రంగాల్లో పని చేస్తోన్న కార్మికులు, ఉద్యోగులు తమ అభిప్రాయాలను ఈ నెలాఖరులోగా తెలియజేయాలని తెలిపింది.

ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం 8 గంటలు పని చేస్తే ఒక వర్కింగ్ డేగా లెక్కిస్తున్నారు. అదనంగా భోజన విరామం అరగంట కూడా లెక్కలోకి తీసుకుంటే ఎనిమిదిన్నర గంటలు అవుతోంది. కానీ వేతన కోడ్‌లో భాగంగా సాధారణ పని రోజును 9 గంటలుగా చెప్తున్నారు. ఏదైనా విరామ సమయం ఎక్కువగా ఇచ్చినా రోజుకు 12 గంటలు దాటి వర్కింగ్ డేగా ఉండటానికి వీల్లేదని తెలిపింది. రోజుకు 8 గంటల నుంచి 9 గంటలకు పెంపు సహా వివిధ కార్మిక ప్రమాణాలకు సంబంధించి మీ విలువైన అభిప్రాయం కూడా చెప్పవచ్చు. ఇందుకు వివిధ రంగాలలో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగులు.... కార్మిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజీవ్ రంజన్ (rajiv.ranja76@gov.in), అసిస్టెంట్ డైరెక్టర్ బికాశ్ కుమార్ మాలిక్ (malick.bikash@gov.in) మెయిల్స్‌కు తమ అభిప్రాయాలు పంపించవచ్చు.