Begin typing your search above and press return to search.

ప్రైవేట్ జెట్‌లు, చార్టర్డ్ విమానాల రాకపోకలకు అనుమతి !

By:  Tupaki Desk   |   26 May 2020 7:30 AM GMT
ప్రైవేట్ జెట్‌లు, చార్టర్డ్ విమానాల రాకపోకలకు అనుమతి !
X
ప్రపంచాన్ని వణికిపోయేలా చేస్తున్న వైరస్ ను అరికట్టడానికి లాక్ ‌డౌన్ ను విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ ‌ కారణంగా నిలిచిపోయిన విమాన సర్వీసులు సోమవారం నుంచి పున: ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ప్రైవేట్ జెట్ ‌లు, చార్టర్డ్ విమానాలను దేశీయ మార్గాల్లో రాకపోకలు సాగించేందుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పచ్చజెండా ఊపింది. ప్రైవేట్ జెట్‌ లు, చార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్లు, మైక్రోలైట్ విమానాల రాకపోకలకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ నెల 25వతేదీ నుంచి అనుమతిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాటిలో ప్రయాణించే వారికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. చార్టర్డ్ విమానాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు విమానం బయలుదేరే సమయానికి కనీసం 45 నిమిషాల ముందు విమానాశ్రయం లేదా హెలీప్యాడ్ వద్ద రిపోర్టు చేయాలని పౌరవిమానయాన మంత్రిత్వశాఖ మార్గదర్శకాల్లో కోరింది.

వృద్ధులు, గర్భిణులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు విమాన ప్రయాణాలు దూరంగా ఉండాలని పౌరవిమానయాన శాక సూచించింది. అయితే ఎయిర్ అంబులెన్సులకు ఈ నియమం వర్తించదు. విమాన ఆపరేటర్లు, ప్రయాణికుల మధ్య పరస్పరం అంగీకరించిన నిబంధనల ప్రకారం చార్టర్డ్ విమాన ప్రయాణ చార్జీలు ఉండాలని మంత్రిత్వశాఖ తెలిపింది. చార్టర్డ్ విమానాల్లో ప్రయాణించే వారు కూడా ఆరోగ్యసేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని, వారు ఫేస్ మాస్క్ విధిగా ధరించాలని కోరింది. కాగా, లాక్‌డౌన్‌ కారణంగా.. దేశవ్యాప్తంగా కార్గో సేవలు తప్ప మిగిలిన అన్ని రకాల విమాన రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.