గోరంట్ల న్యూడ్ వీడియో ...సీబీఐ దిగుతుందా...?

Tue Aug 16 2022 19:27:57 GMT+0530 (IST)

Gorantla nude video will CBI come down

ఏపీలో రచ్చగా ఉన్న వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో రాజకీయాల్లో దుమారమే రేపుతోంది. ఈ న్యూడ్ వీడియో తనది కాదు ఇది ఫేక్ అని ఎంపీ గారు అంటున్నారు.తనను బదనాం చేస్తున్నారు అని ఆయన ఆరోపిస్తున్నారు. కొందరు కలసి బీసీనైన తనను రాజకీయంగా హత్య చేయాలని చూస్తున్నారు అని ఆయన మండిపడ్డారు.ఇక ఈ వీడియో ఫేక్ అని అనంతపురం ఎసెపీ ఫకీరప్ప మీడియా ముందు చెబితే తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టాభి అయితే అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్ లో చేసిన టెస్టులలో ఈ వీడియో ఒరిజినల్ అని తేలింది అంటూ మాధవ్ మీద యాక్షన్ కి డిమాండ్ చేశారు. ఇంకో వైపు దీని మీద జాతీయ స్థాయిలో చర్చ సాగుతోంది.

పంజాబ్ కి చెందిన కాంగ్రెస్ ఎంపీ లోక్ సభ స్పీకర్ కి లేఖ రాసి ఎంపీ మీద చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంకో వైపు జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ విషయం మీద సీరియస్ అయింది. దీని మీద పూర్తి విచారణ చేయాలని ఏపీ డీజీపీని కోరింది.

ఇపుడు ఈ వివాదం మోరో మలుపు తీసుకుంటోంది. ఏపీ హై కోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ మాధవ్ ది అని భావిస్తున్న వీడియో మీద సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఈ వీడియో మీద దర్యాప్తు జరపాలని కూడా కోరారు. అలాగే మాధవ్ మీడియా ముందు చేసిన కామెంట్స్ వల్ల కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందంటూ ఆ వీడియో బైట్స్ ని కూడా సీబీఐకి పంపించారు.

ఆయన తన ఫిర్యాదుని ఈ మెయిల్ ద్వారా చెన్నై లో ఉన్న సీబీఐ అఫీసుకు పంపించారు. మరి సీబీఐ దీని మీద ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

ఇప్పటికే దీని మీద సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ సహ విపక్షాలు కోరుతున్న నేపధ్యంలో హై కోర్టు న్యాయవాది ఈ పని చేయడం విశేషమే. మరి సీబీఐ ఫీల్డ్ లోకి నేరుగా దిగుతుందా లేదా  అన్నది చూడాలి.