Begin typing your search above and press return to search.

నెత్తి నోరు కొట్టుకుంటూ బూతులు తిడుతున్నా గోరంట్లను వదలట్లేదే?

By:  Tupaki Desk   |   13 Aug 2022 11:30 AM GMT
నెత్తి నోరు కొట్టుకుంటూ బూతులు తిడుతున్నా గోరంట్లను వదలట్లేదే?
X
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు మరిన్ని తలనొప్పులు చుట్టుకుంటున్నాయి. ఆయనకు సంబంధించినదిగా చెబుతున్న ప్రైవేటు వీడియో ఒకటి బయటకు రావటం.. అది తనది కాదంటూ ఆయన చెప్పటం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వాడిన భాష.. తిట్టిన తిట్లు షాకింగ్ గా మారాయి. రాయలేని.. వినలేని రీతిలో ఆయన టీడీపీ నేతల మీదా.. కొన్ని మీడియా సంస్థల మీదా ఇష్టారాజ్యంగా విరుచుకుపడ్డారు. షాకింగ్ వీడియో బయటకు వచ్చిన వేళ.. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రెస్ మీట్ పెట్టి.. విచారణ జరుపుతామని.. ఒకవేళ తప్పని తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కట్ చేస్తే.. ఒకే రోజు అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప.. సజ్జల వేర్వేరుగా ప్రెస్ మీట్లు పెట్టేసి.. గోరంట్ల వీడియో మీద క్లీన్ చిట్ ఇచ్చేసినట్లుగా వెల్లడించటం తెలిసిందే. గోరంట్ల వీడియోపై ఇతర రాష్ట్రాల ఎంపీలు కంప్లైంట్ చేయటం.. జాతీయ మహిళా కమిషన్ వరకు విషయం వెల్లటం తెలిసిందే. ఈ పరిణామాలన్నీ గోరంట్లను ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ఆయన్ను కదిలిస్తే చాలు.. రాయలేని భాషలో తిట్టిపోస్తున్నారు.

ఇలాంటి వేళ.. ఆయనకుమరో చిరాకు పుట్టించే పరిణామం చోటు చేసుకుంది. ఏపీ హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా కు లేఖ రాశారు. ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నంగా మహిళతో వీడియో కాల్ మాట్లాడినట్లుగా ఉన్న వీడియో క్లిప్ ఫేక్.. మార్పింగ్ వీడియోగా అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప చెప్పిన వైనాన్ని ఆయన తప్పు పట్టారు. పలు అంశాల్ని ప్రస్తావిస్తూ.. కేంద్ర మంత్రిఅమిత్ షాకు లేఖ రాసి.. ఈ క్లిప్ను కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరీక్షలు నిర్వహించాలని కోరారు.

మహిళలపై జరుగుతున్న నేరాల్లో వైసీపీ నేతలు.. మద్దతుదారుల ప్రత్యక్ష.. పరోక్ష ప్రమేయం ఉంటోంది. వైసీపీ తరఫున చట్టసభలకు ఎన్నికైన నాయకులు మహిళా ప్రభుత్వ ఉద్యోగుల్ని.. ఇతర మహిళల్ని బెదిరించిన సందర్భాలు ఉన్నాయని.. వారిని కాపాడేందుకు పోలీసుల్లోని కొందరు ప్రయత్నిస్తున్నట్లుగా ఆరోపించారు.

మాధవ్ వీడియో క్లిప్ పై సమగ్ర విచారణ జరపాలని.. ప్రజలకు వాస్తవాల్ని వెల్లడించాలన్నారు. అంతేకాదు.. వీడియో క్లిప్ విచారణ జరుగుతున్న సమయంలోనే వాస్తవాల్ని వక్రీకరించి వివరాలు బహిర్గతం చేయటం పోలీసుల ఎథిక్స్.. స్టాండింగ్ ఆర్డర్ కు విరుద్ధంగా పేర్కొన్నారు. ఆయనపై కూడా శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ న్యాయవాది ఫిర్యాదు ఇప్పుడు సంచలనంగా మారింది. మరి.. దీనికి అమిత్ షా ఎలా రియాక్టు అవుతారో? చూస్తుంటే.. గోరంట్ల మాధవ్ అనుకుంటున్న దానికి భిన్నమైన పరిణామాలు ఆయనకు మరింత ఆగ్రహాన్ని కలిగించేలా చేస్తున్నట్లుగా ఉన్నాయే?