అందులో పండిపోయారు స్వామీ..... టీడీపీ పెద్దాయన సెటైర్లు...?

Fri Feb 11 2022 21:06:05 GMT+0530 (India Standard Time)

Gorantla Butchaiah Chowdary Fires On Jagan

రాజకీయం అంటే ఒక పద్ధతిగా సాగుతుంది ఇలాగే ఉంటుంది అని పూర్తిగా ట్రెడిషనల్ రూట్ లో అన్నీ చూస్తూ నడచిన వారున్నారు. అలా గత కొన్ని  దశాబ్దాలుగా పాలిటిక్స్ ని  చూస్తూ వచ్చిన వారు ఆయన. టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ మోస్ట్ నేత కూడా  ఆయన. మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి జగన్ మీద ఇపుడు వేస్తున్న సెటైర్లు బాగానే తగులుతున్నాయి.ఆయన ఎన్నో రకాలైన రాజకీయాన్ని చూసారు కానీ జగన్ మార్క్ పాలిటిక్స్ మాత్రం అసలు ఎక్కడా చూడలేదనే అంటున్నారు. జగన్ ది డైవర్షన్ పాలిటిక్స్.  అందులో ఆయన బాగా పండిపోయారు అంటున్నారు గోరంట్ల. ఇదెక్కడ రాజకీయం బాబూ ఒక ఇష్యూ ఉంటే దాన్ని క్షణాల్లో అటునుంచి ఇటు తప్పించేస్తున్నారు. మరోటి తెచ్చి పెడుతున్నారు అని అంటున్నారు

ఇలా గత రెండున్నరేళ్ళుగా జగన్ డైవర్షన్ పాలిటిక్స్ సాగుతోందని గోరంట్ల గుస్సా అవుతున్నారు. ఒక సీరియస్ సబ్జెక్ట్ ని పక్క దోవ పట్టించడంలో ప్రావీణ్యాన్ని వైసీపీ నేతలు సంపాదించేశారు అని ఆయన అంటున్నారు.అసలు సినిమా టికెట్లు ఎవరు తగ్గించమన్నారు. మళ్లీ వాటిని ఎవరు పెంచమన్నారు. అంటే సమస్య మీరే క్రియేట్ చేస్తారు. ఆ మీదట దాన్ని గొప్పగా పరిష్కరించినట్లుగా బిల్డప్ ఇస్తారు. ఇదేమి రాజకీయమండీ అంటూ గోరంట్ల ఫైర్ అవుతున్నారు.

ఒక విధంగా ఏపీలో ప్రతీ అంశంలో ఇలాంటి పాలిటిక్స్ సాగుతోందని ఇదంతాకోట్లాది  ప్రజల దౌర్భాగ్యం అని కూడా ఆయన గట్టి మాటే వాడేశారు. ఏది ఏమైనా ఎన్టీయార్ కాలం నుంచి సీఎం లను చూస్తూ వస్తున్న గోరంట్లకు జగన్ డైవర్షన్ పాలిటిక్స్ మాత్రం తెగ చికాకుగా ఉన్నాయని చెబుతున్నారు.

ఆయన ఫైర్ అయిన తీరు దానికి అద్దం పడుతోంది. మరి ఏపీలో ఇలాంటి పాలిటిక్స్ ఇక్కడితో ఆగుతాయా ఇంకా కొత్త రూపులో సాగుతాయా అన్నది వేచి  చూడాల్సిందే. ఏమైనా ఒక్క మాట నిజం అంటున్నారు అంతా. గత కాలం రాజకీయాలు మాత్రం ఇపుడు లేవు అన్నదే ఆ మాట.