ఈ ‘జోకర్’ సింపుల్ గా తీసుకుంటే.. భారీ నష్టం తప్పదు

Mon Jul 13 2020 11:45:45 GMT+0530 (IST)

Google removes 11 apps from Play Store

జోకర్.. పేరు విన్నంతనే ముఖం మీద చిరునవ్వు వచ్చేస్తుంది.  కానీ.. ఇప్పుడు చెప్పే జోకర్ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. లేదంటే.. తిప్పలు తప్పవని హెచ్చరిస్తున్నారు టెక్ నిపుణులు. జోకర్ పేరుతో పెట్టి గూగుల్ ప్లే స్టోర్ లో వదిలిని మాల్ వేర్ ఇప్పుడు పదకొండు యాప్స్ లోకి చొరబడటమే కాదు.. వాటిని డౌన్ లోడ్ చేసుకున్న ఫోన్లకు చుక్కులు చూపిస్తోంది. దీని దెబ్బకు గూగుల్ సైతం.. సదరు పదకొండు యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకున్న వారు తక్షణమే తొలగించాలని పేర్కొనటం చూస్తే.. ఇష్యూ ఎంత సీరియస్ అన్నది ఇట్టే అర్థమవుతుంది.గత ఏడాది చివర్లో వదిలిని ఈ మాల్ వేర్ ప్రభావం ఇప్పుడు బయటకు వచ్చింది. యాప్స్ లో ఒక మూలన దాక్కునే ఈ మాల్ వేర్.. సదరు యాప్ లను డౌన్ లోడ్ చేసుకున్నంతనే మొబైల్ లోకి వెళుతుంది.ఫోన్లోకి ఒక్కసారి ఎంటర్ అయ్యాక తన తఢాఖా ఏమిటో చూపిస్తుంది. యూజర్ ప్రమేయం లేకుండానే.. దానికి నచ్చిన యాప్స్ ను అదే పనిగా డౌన్ లోడ్ చేసుకుంటుంది. యూజర్ కు ఇలాంటి పరిస్థితి ఎందుకన్నది కూడా అర్థం కాదు.

దీని తీవ్రతను గుర్తించిన గూగుల్ ఇప్పుడు.. జోకర్ మాల్ వేర్ ఉన్న పదకొండు యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకున్న వారు తక్షణమే డిలీట్ చేయాలని కోరుతోంది. అయితే.. ఈ పదకొండు యాప్స్ అంత ప్రముఖమైనవి కాకపోవటం ఊరటగా చెప్పొచ్చు. సాధారణంగా గూగుల్ ప్లే స్టోర్ లో సెక్యురిటీ కట్టుదిట్టంగా ఉంటుంది. అయినప్పటికీ.. ఆ సెక్యురిటీని దెబ్బ తీసేలా జోకర్ మాల్ వేర్ ఉండటం గమనార్హం.

జోకర్ మాల్ వేర్ ఉన్న 11 యాప్స్ ఏమంటే..

1. ఇమేజ్ కంప్రెస్
2. రిలాక్సేషన్
3. ఆండ్రాయిడ్ SMS
4. చెర్రీ సెండ్ SMS
5. లవింగ్ లవ్ మెసేజ్
6. మెమరీ గేమ్ ట్రైనింగ్
7. విత్ మీ
8. HM వాయిస్
9. ఫ్రెండ్స్ SMS
10. రికవరీ ఫైల్స్
11. ఎల్ ప్లాకర్ రిమైండ్ మీ