Begin typing your search above and press return to search.

లే ఆఫ్ ఎఫెక్ట్.. గ్రీన్ కార్డును పాజ్ చేసిన గూగుల్..!

By:  Tupaki Desk   |   24 Jan 2023 5:00 PM GMT
లే ఆఫ్ ఎఫెక్ట్.. గ్రీన్ కార్డును పాజ్ చేసిన గూగుల్..!
X
2023 ప్రారంభం నుంచే టెక్ దిగ్గజ కంపెనీలన్నీ ఉద్యోగులకు షాకుల మీద షాకులిస్తున్నాయి. వరుసబెట్టి బడా కంపెనీలన్నీ లేఆఫ్ కు సిద్ధమవుతుండటంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. టెక్ దిగ్గజం గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఇంక్ సైతం ఈ లిస్టులో చేరింది. ఆ కంపెనీకి చెందిన 12 వేల మంది ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలని గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్ ఇటీవల మెమో జారీ చేయడం చర్చనీయమైంది.

ఈ నోటిసులో ఉద్యోగులు పొందే అన్ని ప్రయోజనాలన్నీ పేర్కొన్నందున ఆ తర్వాతి మెయిల్లో లేఆఫ్ కు సంబంధించిన వార్త ఉండొచ్చని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇంటి నుంచి వర్క్ చేయమని రాసిన చివరి లైన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమ వర్క్‌ఫోర్స్‌ను సుమారు 12వేలు తగ్గించాలని నిర్ణయించుకునేందుకు గూగుల్ నిర్ణయించింది.

ఈమేరకు అమెరికాలో ఈమేరకు ప్రభావితమైన ఉద్యోగులకు ఇప్పటికే ప్రత్యేక ఇమెయిల్‌ను పంపించింది. తాజాగా యుఎస్‌లో పని చేస్తున్న టెక్ ఉద్యోగుల ఉద్యోగి-ప్రాయోజిత గ్రీన్ కార్డ్‌ని పొందేందుకు కీలకమైన ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్‌మెంట్ (PERM)ని గూగుల్ పాజ్ చేసింది. గూగుల్ నిర్ణయంపై భారతీయ టెక్ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.

గూగుల్ ఇప్పటికే ఒక ఉద్యోగి ద్వారా తన విదేశీ ఉద్యోగులందరికీ PERMని పాజ్ చేస్తానని చెప్పి ఉద్యోగులను అసంతృప్తికి గురిచేసింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ నుంచి వచ్చిన ఈ మెయిల్ ఉద్యోగుల కుటుంబాలపై ఎలా ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈమేరకు ఐటి ఉద్యోగుల అనామక సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ టీమ్ బ్లైండ్‌లో గూగుల్ ఉద్యోగి ఈ మెయిల్‌ను పోస్ట్ చేశారు.

దీనిని గూగూల్ ధృవీకరిస్తూ ఇప్పటికే సమర్పించిన PERM అప్లికేషన్‌లకు మద్దతునిస్తూనే ఉంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుత PERM నియమాలు 2005 నుంచి అమలుల్లో ఉంటాయని పేర్కొంది. ఈ ఆప్లికేషన్ అనేది నిర్దిష్ట సమయంలో ఒక నిర్దిష్ట ప్రదేశంలో నిర్దిష్ట ఉద్యోగం కోసం కార్మిక శాఖ నుంచి ధృవీకరణ ప్రతం.

దీని ద్వారా ఉద్యోగ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఏది ఏమైనా టెక్ కంపెనీలు వరుసబెట్టి ఉద్యోగులకు ఇంటికి పంపుతుండటం భారతీయ టెకీలను సైతం కలవరానికి గురిచేస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.