ఆ యాప్ లపై నిషేధం.. గూగుల్ సంచలన నిర్ణయం

Sun Aug 01 2021 21:20:26 GMT+0530 (IST)

Google bans Sugar Daddy apps

కత్తిలాంటి నవ యువతులతో డేటింగ్ చేయాలనుకునే వయసు మళ్లిన వృద్ధుల కోసం ఏర్పాటు చేసినవే ‘షుగర్ డాడీ యాప్స్’ ఇందులో పెళ్లి ప్రేమ ఉండదు.. ఆ వృద్ధులకు నడి వయసు వారికి శారీరక సుఖం అందిస్తే..దానికి బదులుగా ఆ యువతులకు భారీగా డబ్బు కాస్ట్ లీ గిఫ్ట్స్ ను రిటర్న్ గా ఇవ్వాల్సి ఉంటుంది. విదేశాల్లో బాగా నడిచే ఈ వ్యవహారానికి మన దేశంలోనూ ఇప్పుడిప్పుడే క్రేజ్ ఉంది. కానీ త్వరలో ఇలాంటి యాప్స్ పై నిషేధం విధించేందుకు గూగుల్ సిద్ధం కావడం వృద్ధులకు షాకింగ్ గా మారింది.సెప్టెంబర్ 1 నుంచి ‘షుగర్ డాడీ యాప్స్’ను ప్లే స్టోర్ నుంచి తొలగించబోతున్నట్లు గూగుల్ ప్లే స్టోర్ స్పష్టం చేసింది. సెక్సువల్ కంటెంట్ మీద కొరడా ఝలిపించాలని గూగుల్ నిర్ణయించింది. ఈ మేరకు పాలసీల్లో షుగర్ డాడీ యాప్స్ ను కూడా టార్గెట్ గా చేర్చింది.

ఈ యాప్స్ సెక్సువల్ యాక్ట్ కిందకే వస్తాయని.. గూగుల్ ప్లే స్టోర్ జూన్ 29న ఓ ప్రకటన విడుదల చేసి సంచలనం రేపింది.

వయసు మళ్లిన ధనవంతులు.. డబ్బులు వెదజల్లి నవ యువతులైన అమ్మాయిలతో డేటింగ్ కోసం ఉపయోగించే ఈ యాప్స్ ముసుగులో వ్యభిచారం నడుస్తోందని గూగుల్ భావిస్తోంది. ఇక మామూలు డేటింగ్ యాప్ లు కూడా ఇలా అశ్లీలతను పెంపొందించేలా వ్యవహరిస్తే వాటి మీద కూడా నిషేధం విధించక తప్పదని గూగుల్ ప్లే స్టోర్ హెచ్చరికలు జారీ చేస్తోంది.

ఇక మన దేశంలోనూ ఈయాప్స్ ఇప్పుడిప్పుడే వేళ్లూనుకుంటున్నాయి. భారత దేశంలో 3.50 లక్షల మంది షుగర్ డాడీలు ఉన్నారు. ఇండోనేషియాలో 60వేల మంది ఉన్నారు. ‘షుగర్ డాడీ షుగెర్ డాడీ ఎస్.డీఎం స్పాయిల్ లాంటి పాపులర్ యాప్స్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి.