Begin typing your search above and press return to search.

గూగుల్ .. మళ్లీ కోలుకోవడం కష్టమేమో ! ఇదే కారణమా ?

By:  Tupaki Desk   |   18 Oct 2021 9:38 AM GMT
గూగుల్ .. మళ్లీ కోలుకోవడం కష్టమేమో ! ఇదే కారణమా ?
X
ఇటీవలి కాలంలో గూగుల్ వాడకం విపరీతంగా పెరిగింది. ఏం అవసరం పడినా.. ఇంటర్నెట్‌లో వెతికే ఎక్కువమంది ఆశ్రయించేది గూగుల్‌ బ్రౌజర్‌ నే. గూగుల్‌ రూపొందించిన ఈ క్రాస్‌ ప్లాట్‌ ఫామ్‌ వెబ్‌ బ్రౌజర్‌ ను, రోజూ కొన్ని కోట్ల మంది ఉపయోగిస్తుంటారు. అలాంటిది తన స్వీయ తప్పిదంతో గూగుల్‌ వాళ్లందరినీ దూరం చేసుకోవాలని చూస్తుందా. సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయి. గూగుల్‌ క్రోమ్‌ ను అప్‌ డేట్‌ చేసుకోండి గత కొన్ని నెలలుగా తెర మీద వినిపిస్తున్న ప్రకటన ఇది. స్వయంగా తన యూజర్ల కోసం గూగుల్‌ స్వయంగా చేసిన భారీ హెచ్చరిక ఇది. సాధారణంగా సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్స్‌ ఏవీ ఈ తరహా ప్రకటనలు చేయవు.

కానీ, అందుకు విరుద్ధంగా గూగుల్‌ చేసిన ప్రకటన, ఇప్పుడు గూగుల్‌ కే డ్యామేజ్‌ చేయనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యూజర్ల భద్రత విషయంలో గత కొంతకాలంగా హెచ్చరికలు జారీ చేస్తున్న గూగుల్‌, ఈమధ్య మరో అప్‌ డేట్‌ ఇచ్చింది. 19 రకాల సెక్యూరిటీ సమస్యలను సైతం ఈ కొత్త క్రోమ్‌ వెర్షన్‌కు అప్‌డేట్‌ కావాలని కోట్ల మంది యూజర్లను కోరింది. అంతేకాదు కాపీ లింక్స్‌, క్యూఆర్‌ కోడ్‌ లను వెబ్‌ సైట్ల తో పంచుకునేందుకు సురక్షితమైన హబ్‌ గా క్రోమ్‌ కొత్త వెర్షన్‌ ను ప్రకటించుకుంది. అయితే గూగుల్‌ చేసిన ఈ ప్రకటన పరోక్షంగా తన యూజర్లను తానే దూరం చేసుకున్నట్లు అవుతుందని ‘ది రిజిస్ట్రర్‌’లో ఒక ఎడిటోరియల్‌ కథనం ప్రచురించింది.

ఈ ప్రకటన ద్వారా గూగుల్‌ బ్రౌజర్‌ నుంచి కోట్ల మంది దూరం అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడింది. పైగా గూగుల్‌ చేస్తున్న సవరణలు.. మొత్తంగా ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ వ్యవస్థనే ప్రభావితం చేయనున్నాయట!. గూగుల్‌ అప్‌డేట్‌ వల్ల ఏం ఒరగకపోగా, వెబ్‌సైట్‌ వ్యవస్థ నాశనం అవుతుందని సీనియర్‌ టెక్‌ ఎక్స్‌ పర్ట్‌ స్కాట్‌ గిల్‌ బర్ట్‌ సన్‌ ఈ మేరకు ఆ వ్యాసంలో పేర్కొన్నారు. అంతేకాదు గూగుల్‌ చర్యల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని, మొత్తంగా కమ్యూనికేషన్‌ వ్యవస్థ దెబ్బతింటుందని పేర్కొంది. వెబ్‌ అనేది కేవలం ప్రొఫెషనల్స్‌ డెవలపర్స్‌ కోసమే కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కొసమెరుపు ఏంటంటే, గూగుల్‌ బ్రౌజర్‌ కంటే మోజిల్లా ఫైర్‌ఫాక్స్‌ తన దృష్టిలో బెస్ట్‌ బ్రౌజర్‌ అంటూ స్కాట్‌ కామెంట్లు చేయడం.

సాధారణంగా గూగుల్‌ అకౌంట్‌ ను రెగ్యులర్‌ డివైజ్‌ లలో లాగిన్‌ కానప్పుడు కన్ఫర్మ్‌ మెసేజ్‌ ఒకటి వస్తుంది. దానిని క్లిక్‌ చేస్తేనే అకౌంట్‌ లాగిన్‌ అవుతుంది. అయితే ఇక మీదట ఇది రెండు దశల్లో (2 సెటప్‌ వెరిఫికేషన్‌) జరగనుంది. హ్యాకర్లు అకౌంట్‌ను ట్రేస్‌ చేయడానికి వీల్లేని రేంజ్‌లో ఈ విధానం ఉండబోతోందని మంగళవారం గూగుల్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. అంతేకాదు రకరకాల సాఫ్ట్‌ వేర్‌ లను ఉపయోగించి హ్యాకర్లు పాస్‌ వర్డ్‌ ను ఊహించడం లేదంటే దొంగతనంగా అకౌంట్‌ ను లాగిన్‌ కావడం లాంటి చర్యలు సంక్లిష్టం కానున్నాయి.

టు ఫాక్టర్ అతేంటికేషన్ పేరుతో ఈ సెక్యూరిటీని చాలాకాలం క్రితమే తీసుకొచ్చింది గూగుల్‌. ఇందుకోసం గూగుల్‌ క్రోమ్‌, జీమెయిల్‌, ఇతరత్ర గూగుల్‌ అకౌంట్లను అప్‌ డేట్‌ కావాల్సి ఉంటుంది. అయితే, ఈ ఫీచర్‌ను యూజర్‌ యాక్టివేట్‌(సెట్టింగ్స్‌ ద్వారా) చేయాల్సిన అవసరమేం లేదు. యూజర్‌ పర్మిషన్‌ లేకుండా గూగులే ఈ పని చేయనుంది. 2021 డిసెంబర్‌ కల్లా 150 మిలియన్‌ గూగుల్‌ అకౌంట్లను టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ పరిధిలోకి తీసుకురానున్నట్లు గూగుల్‌ పేర్కొంది. అలాగే 20 లక్షల యూట్యూబ్‌ క్రియేటర్లను అతేంటికేషన్ ఫీచర్‌ ను ఆన్‌ చేయాల్సిందిగా సూచించింది.