మహిళా ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్ .. 12 రోజుల పాటు పిరియడ్ లీవ్స్ !

Wed Aug 12 2020 14:20:25 GMT+0530 (IST)

Good News for Women Employees

భారతదేశంలో రుతుస్రావం  పై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎంతో మంది మహిళలు మరియు బాలికలు ఈ ఆధునిక ప్రపంచంలో కూడా  వివక్ష మరియు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. రుతుస్రావం జరిగే రోజుల్లో మహిళల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి సమస్యలున్నప్పుడు ఏ పనీ చేయాలనిపించదు. కానీ ఉద్యోగాలు చేసే మహిళలు తప్పనిసరి పరిస్థితుల్లో విధులకు హాజరై .. అయిష్టంగానే పని చేస్తుంటారు. దీనితో ఈ పరిస్థితి పై అవగాహన ఉన్న పలు కంపెనీలు తమ మహిళా ఉద్యోగులకు నెలసరి మొదటి రోజున వేతనంతో కూడిన సెలవును అందిస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులో జొమాటో కూడా చేరిపోయింది. ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో పీరియడ్స్ లో ఉన్న మహిళలకు 10 రోజుల లీవ్ ఇస్తున్నట్లుగా ప్రకటించింది.తాజాగా సూరత్ లోని డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ కూడా ఇలాంటి  ఆఫర్ నే ప్రకటించింది. IVIPANAN సంస్థ వ్యవస్థాపకుడు భౌతిక్ శేత్  మహిళా స్టాఫ్ పీరియడ్స్  లో ఉన్న వారు వెంటనే అడిగి తీసుకోవాలని వారికి 12 రోజుల లీవ్ తీసుకునేలా వెసులుబాటు కల్పించినట్టు తెలిపారు. ఈ కంపెనీ 2014లో స్థాపించారు. ఆ కంపెనీలో  ఉన్న వారు ఎనిమిది మంది మహిళలే. వారి ఆరోగ్యవంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భౌతిక్ శేత్ ప్రకటించారు. ఇక ఇప్పటినుండి పీరియడ్స్ మీద లీవ్ తీసుకున్న వారందరికీ పెయిడ్ లీవ్స్ ఇస్తున్నట్లు ప్రకటించారు. పీరియడ్స్ సమయంలో మహిళా స్టాఫ్ కొంచెం   కంఫర్ట్ గా లేనట్టు   అనిపించింది. పని ఒత్తిడి ఆఫీసు వాతావరణం వారి బాధ ఇబ్బందిని పెంచుతున్నట్లుగా అనిపించొచ్చు.

ఇప్పుడు ఎవరైనా స్టాఫ్ సమస్యగా అనిపిస్తే 12 రోజుల లీవ్ తీసుకోవచ్చు. ఒక రోజు మాత్రం పెయిడ్ లీవ్ కల్పిస్తారు అని చెప్పారు. ఇండియాలో ఉన్న అన్ని చిన్న తరహా బిజినెస్ లకు ఓ మెసేజ్ ఇస్తున్నాం. మగ ఆడల మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాం అని ఆయన తెలిపారు. నెలసరి సమయంలో తలెత్తే శారీరక నొప్పుల కారణంగా తప్పని పరిస్థితుల్లో విధులకు హాజరవుతున్నారు చాలామంది మహిళలు. ఇలా శరీరం మనసు సహకరించనప్పుడు పనిపై కూడా పూర్తి దృష్టి పెట్టలేరు. అందుకే ఈ రోజుల్లో మహిళల శారీరక ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యమిస్తూ ఇప్పటికే మన దేశంలోని పలు కంపెనీలు తమ మహిళా ఉద్యోగులకు నెలసరి మొదటి రోజున వేతనంతో కూడిన సెలవును అందిస్తున్నాయి.