Begin typing your search above and press return to search.

బంగారు గనులు...అమ్మకానికి కేంద్రం రెడీ

By:  Tupaki Desk   |   16 Aug 2022 9:30 AM GMT
బంగారు గనులు...అమ్మకానికి కేంద్రం రెడీ
X
బంగారం అంటేనే చాలు దాని విలువ కట్టలేనిది. ఇక దాని మీద మోజు ఎంత ఉందో వేరేగా చెప్పలేనిది. భారతీయులు ఎక్కువగా ఇష్టపడేది కూడా బంగారమే. ఏ విషయాన్ని అయినా బాగా సరి పోల్చాలనుకుంటే బంగారంతోనే పోల్చే గుణం ఒక్క భారతీయులకే ఉంది.

మరి బంగారమే ఇంతలా క్రేజ్ సంపాదించుకుంటే బంగరం గనుల గురించి వింటేనే మనసు పులకరించక మానదు కదా. ఒంటి నిండా బంగారం ఆభరణాలు ధరించిన వారిని గనులు ఏమైనా ఉన్నాయా అని అంటారు. అలాంటిది బంగారు గనులు దేశంలో చాలా ఉన్నాయి. ఏపీలో కూడా ఉన్నాయి. మరి ఆ గనులు అమ్మకానికి రెడీ అని కేంద్రం చెబుతోంది.

దేశంలో పదమూడు బంగారం గనులను విక్రయించడానికి కేంద్రం రెడీ అయింది. అందులో ఏకంగా పది గనులు ఒక్క ఏపీలోనే ఉన్నాయి. మరో మూడు గనులు ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయి. ఈ మొత్తం గనులను అమ్మకానికి కేంద్రం పెట్టేసింది. ఇలా బంగారం గనులను అమ్మడం ద్వారా జాతీయ స్థూల ఉత్పత్తిలో మైనింగ్ వాటాను పెంచాలన్నది కేంద్రం ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.

అదే టైమ్ లో రాష్ట్రాలు కూడా ఇప్పటిదాకా 199 మినరల్ బ్లాక్స్ వాటాలను వేలం వేశాయి. ఇలా మినరల్ బ్లాక్స్ ని వేలం వేస్తూ రాష్ట్రాలు తమ ఆదాయన్ని పెంచుకుంటున్నాయి.

ఇపుడు బంగారం గనుల అమ్మకం ద్వారా కేంద్రం కూడా భారీ ఆదాయాన్నే ఆశిస్తోంది అని అంటున్నారు. మొత్తానికి అమ్మడాలు అన్నది చాలా కామన్ పాయింట్ గా ఉంది.

కేంద్రం అమ్మకం అంటోంది, రాష్ట్రాలు అదే బాటన పడుతున్న పడుతున్నాయి. తరగని గనులు ఉన్న ఈ దేశంలో వాటిని అమ్ముకుంటూ పోతే రేపటి తరం ఏమవుతుంది. రేపటి దేశం సంగతేంటి అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఏది ఏమైనా 13 బంగారం గనులను అమ్మకానికి పెట్టాలని కేంద్రం తీసుకున్న ఈ పెద్ద నిర్ణయం బంగారం ప్రేమికులను బాగా గాయపరచేదే.