Begin typing your search above and press return to search.

నిన్న పంజాబ్.. ఇవాళ గోవా సీఎం అభ్యర్థుల్ని ప్రకటించిన సామాన్యుడు

By:  Tupaki Desk   |   19 Jan 2022 9:30 AM GMT
నిన్న పంజాబ్.. ఇవాళ గోవా సీఎం అభ్యర్థుల్ని ప్రకటించిన సామాన్యుడు
X
రోటీన్ రాజకీయాలకు భిన్నమైన ఫార్ములాను తెర మీదకు తీసుకొచ్చి.. అందుకు తగ్గట్లు పావులు కదుపుతున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత.. ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. తాజాగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీపార్టీ పంజాబ్.. గోవాల మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఇందుకు తగ్గట్లే.. ఈ పార్టీకి ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి రావటానికి అవకాశం ఉందని.. నగుర్రం ఎగరా వచ్చు అనే వాదన వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. మిగిలిన జాతీయపార్టీల మాదిరి కాకుండా.. ఎన్నికల ప్రచార వేళలోనే.. తమ పార్టీ గెలిస్తే ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పే విషయంలో.. మిగిలిన రాజకీయ పార్టీలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన తెలివిగా ప్రవర్తిస్తున్నారని చెబుతున్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తెలివిని మెచ్చుకోవాలి. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రజలు ఎంపిక చేసుకోవాలని చెబుతూ.. అందుకు ఒక మొబైల్ నెంబరును ఏర్పాటు చేశారు.

తమ ముఖ్యమంత్రిని ఎవరు అనే అవకాశాన్ని ప్రజలకు ఇచ్చినట్లుగా చెప్పి.. సదరు నెంబరునుకు మిస్డ్కాలే చేయటం కానీ.. మెసేజ్ చేయటం కానీ చేయాలని పేర్కొంది. ఇందులో భాగంగా పంజాబ్ ముఖ్యమంత్రిఅభ్యర్థిగా భగవంత్ మాన్ ను సీఎం అభ్యర్థిగా పేర్కొంటూ.. మీ అభిప్రాయాన్ని వెల్లడించాలని కోరారు. ఇందుకోసంజనవరి 17 సాయంత్రం వరకు సమయాన్ని ఇచ్చారు.

సుమారు 21 లక్షల మంది ప్రజలు ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇందులో 93 శాతం మంది కేజ్రీవాల్ పేర్కొన్నా భగవంత్ మాన్ ను సీఎం అభ్యర్థిగా తమ ఓటేశారు. మూడు శాతం మంది పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిద్దుకు ఫోన్ చేయగా.. కొందరు ఢిల్లీ సీఎంగా ఉన్న కేజ్రీవాల్ పంజాబ్ నుంచి పోటీ చేయాలని కోరినట్లుగా వెల్లడించారు. పంజాబ్ లోని సంగ్రూర్ పార్లమెంటు నియోజక వర్గం నుంచి రెండుసార్లు పోటీ చేసి విజయం సాధించిన భగవంత్ మాన్ ను తమ సీఎం అభ్యర్థిగా అత్యధికులు ఓట్లు వేసినట్లుగా చెప్పి.. తమ సీఎం అభ్యర్థిగా అనౌన్స్ చేశారు.

ఇదిలా ఉంటే.. ఈ రోజు (బుధవారం) గోవా సీఎం అభ్యర్థిగా అమిత్ పాలేకర్ ను ఎంపిక చేస్తూ కేజ్రీవాల్ పరకటించారు. న్యాయవాది.. సామాజిక కార్యకర్త అయిన ఆయన.. గోవా జనాభాలో 35 శాతం ఉండే సామాజిక వర్గానికి చెందిన నేతను తమ పార్టీ సీఎం అభ్యర్థిగా ఎంపిక చేయటం గమనార్హం.

గోవా హెరిటేజ్ స్థలంలో అక్రమ కట్టటానికి వ్యతిరేకంగా నిరాహర దీక్షకు దిగటంతో ఆయనకు ఒక్కసారిగా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. గత ఏడాది అక్టోబరులో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన అమిత్ పాలేకర్ ను తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించటం ద్వారా.. తమ విధానాలు మిగిలిన పార్టీల తీరుకు పూర్తి భిన్నమన్న విషయాన్ని తేల్చి చెప్పారని చెప్పాలి.