మా కూతురిని చంపడానికి అనుమతివ్వండి..

Sat Dec 05 2020 15:51:39 GMT+0530 (IST)

Let us kill our daughter

ఈ సమాజంలో తల్లిదండ్రులు పిల్లల క్షేమం కోసం అహర్నిశలు కష్టపడుతుంటారు. వారి బాగు కోసం చివరికి ప్రాణాలైనా తృణ ప్రాయంగా వదిలేస్తుంటారు. అందుకే అంటారు ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల ప్రేమ కి మరే ప్రేమ కూడా సాటి రాదు అని. అది అక్షర సత్యం. తల్లిదండ్రులని ఆస్తుల కోసమో ఇంకో దానికోసమో చంపేసిన పిల్లలు ఉంటారు కానీ పిల్లలని చంపేసిన తల్లిదండ్రులు మాత్రం ఉండరు. కానీ తమ కూతురిని చంపడానికి అనుమతి ఇవ్వండి అంటూ కోర్టులో పిటిషన్ వేశారు.ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ... ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కోర్టులో ఈ మెర్సి కిల్లింగ్ పిటిషన్ దాఖలైంది. తమ కూతురు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతోందని వైద్యం చేయించడానికి తమకు ఆర్థిక స్థోమత లేదని తల్లిదండ్రులు పిటిషన్ లో తెలిపారు. అంతేకాకుండా ఆర్థిక సాయం కోసం చాలా రోజులుగా ఎదురు చూశామని ఎవరూ ముందుకు రాలేదన్నారు. దీనితో రోజురోజుకి తమ ఆరోగ్యం క్షిణించి ఆమె భాద పెరిగిపోతుందని తమ కళ్ల ముందు బిడ్డ పడుతున్న బాధను చూడలేకపోతున్నామని పిటిషన్‌లో కోరారు. ఎలాగైనా మెర్సి కిల్లింగ్‌కు అనుమతి ఇప్పించాలని కోర్టును వేడుకుంటున్నారు. బాధిత కుటుంబం చిత్తూరు జిల్లా మదనపల్లిలోని నీరుగట్టు వారిపల్లికి చెందిన వారు.కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

TAGS: AP Chithoor